బాహుబలి కంక్లూజన్ లో అందరి అభినందనలు అందుకుంటున్న సీన్స్

  • April 28, 2017 / 03:35 PM IST

మొత్తానికి బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ అయిపోయింది. చూసిన వాళ్ళు రిలాక్సేషన్ లో, ఇంకా చూడని వాళ్లు టికెట్స్ టెన్షన్ లో, ఇంకొందరు బావుంది, బాలేదు అనే డిస్కషన్ లో మునిగిపోయారు. సో మొత్తానికి అందరూ బాహుబలి టాపిక్ లోనే ఉన్నారు. సరే సినిమా ఎలా ఉంది?, నచ్చింది, నచ్చలేదు, కుమ్మేసింది, బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్టు, ఎక్స్ పెక్ట్ చేసినంత లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కడు కూడా బాలేదు అనలేని కొన్ని సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ సీన్స్ గురించి మాట్లాడుకుందాం.

1) టైటిల్స్ సీక్వెన్స్ఫస్ట్ పార్ట్ లో ఐకానిక్ షాట్స్ మినియేచర్స్ తో కంప్లీట్ టైటిల్స్ వేసిన స్టైల్ ఏదైతే ఉందో.. స్క్రీన్ మీద ఇంకా ఎవరి బొమ్మ కనపడక ముందే గూస్ బంప్స్ తో ఓం రాసాడు జక్కన్న.

2) బాహుబలి ఎంట్రీఫస్ట్ పార్ట్ లో శివుడికి అంత పెద్ద ఎలేవేషన్ ఇస్తే, వాడి బాబు బాహుబలికి ఎలాంటి ఇంట్రో ఇస్తాడు రాజమౌళి? ఈ ఇంట్రో కి మాత్రం కీప్ యువర్ ఎక్సపెక్టషన్స్ వెరీ హై. కుమ్మి కుమ్మి అవతలేసాడు.

3) బాణాల ఫైట్పోస్టర్స్ లో ప్రభాస్ అనుష్క కలిసి బాణాలు వేసే స్టిల్ ఒకటి అందరికీ గుర్తుండే ఉంటుంది. స్టిల్ లోనే ఒక హై ఇచ్చిన ఆ బిట్ మూవీ లో నెక్స్ట్ లెవెల్ అరాచకం. అక్కడ జరిగే టోటల్ వార్ సీక్వెన్స్ లో, ఎద్దుల మీద బాహుబలి, వాటర్ బ్లాస్టింగ్ అన్ని ఒక ఎత్తు, ఈ బిట్ ఒక్కటి ఒకెత్తు.

4) దేవసేన బోట్ ఎక్కే బిట్దేవసేనని మహిష్మతి తీసుకెళ్లేప్పుడు బోట్ ఎక్కాలి. దృష్టి బాహుబలి పైన పెట్టి అనుష్క అడుగులు తప్పి, పడవ ఎక్కటానికి కర్ర విరిగితే, వెంటనే బాహుబలి కిందకి దూకేస్తాడు. మహా అయితే అందరూ ఏమి ఊహిస్తారు. దేవసేనని ఎత్తుకుని పడవ ఎక్కిస్తాడనేగా, అబ్బే… జక్కన రొమాంటిక్ సీన్స్ లో కూడా హీరో ఎలేవేషన్స్ వదల్లేదు, ఆ క్యూట్ బిట్ నిచెప్పటం వేస్ట్ కానీ చూసి తీరాల్సిందే.

5) హంస నావ సాంగ్ఫస్ట్ పార్ట్ లో ధీవర సాంగ్ విజువల్స్ ఎంజాయ్ చేసిన వాళ్లందరికీ పార్ట్ 2 లో జక్కన్న, హంస నావ సాంగ్ లో చిన్న సైజు అవతార్ చుపించాడు. ఈ లుక్ ని చూపించడానికి బాలీవుడ్ వారికీ కూడా కష్టమే.

6) ఇంటర్వెల్ఇంకా ఇంటర్వెల్ గురించి చెప్పేది ఏముంది?. ఇంటర్వెల్ బ్లాక్స్ లో రాజమౌళి ఇంటర్వెల్ బ్లాక్స్ వేరయా అని ఎప్పుడో తెలుసుకున్నాం. ఇందులో మహేంద్ర బాహుబలి అను నేను… అనగానే మొదలైన రచ్చ 5 నిమిషాల వరకు నాన్ స్టాప్ గూస్ బంప్స్. ఒక డైలాగ్ లేదు, పంచ్ లేదు, ఫైట్ లేదు, ఏనుగులు, గుర్రాలు, మనుషులు.. కావేవీ ఎలేవేషన్స్ కి అనర్హమన్నా టైపు లో రెచ్చి పోయాడు జక్కన్న. సింపుల్ గా చెప్పాలంటే ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ అనగానే ఒక సౌండ్ వస్తుంది కదా, అలాంటిది అన్నమాట. బాహుబలి 2 లో అన్నింటికి కంటే మంచి సీన్ ఏంటంటే అది ఇంట్రెవెల్ సీన్.

7) వాడు తప్పు చేసాడని తేలింది , తలతెగిందిఆడదాని మీద చేయి వేస్తే, నరకాల్సింది వేళ్లు కాదు తల… తర్వాత ఏమి జరుగుతుందో .. దాని గురించి ఇలా చెప్పి రాజమౌళి తన స్టైల్ చూపించారు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే “అరక్షణంలో అరాచకం” అన్నమాట.

8) కట్టప్ప డైలాగ్“నా బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటావా? కట్టప్ప” అని దేవసేన మాములుగా అడిగితే, కళ్ళల్లో ఏంటి
తల్లి తల మీద పెట్టుకుంటా అని జనరల్ గా అనేశాడు. తల మీద పెట్టుకోవటం అంటే ఎక్కడనుండి ఎక్కడికి కనెక్ట్ చేసాడో చూసారా?.

9) దేవసేన చేతి లో పిల్లోడి చేయిశివగామి శివుడిని తీసుకుని వెళ్లిపోయే ముందు, అప్పుడే పుట్టిన పిల్లోడినిచూస్తూ, నన్ను కాపాడటానికి వస్తావని అడగ్గానే, హ్యాండ్ లో హ్యాండ్ పడటమే లేట్, స్క్రీన్ వెనకాల కీరవాణి గారు వై అని రెడీ గా ఉన్నారు. చిన్న ఫ్లాష్ లా వచ్చి వెళ్లి పోయే బిట్ కూడా గూప్స్ గూప్స్ అంతే.

10) క్లైమాక్స్ క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ లో చెప్పుకోవటానికి ఎన్నైనా ఉండొచ్చు. దేవసేన చేతిలో అడవి శేషు తల, ఫ్లైయింగ్ సాసర్ లాగ శివుడి టీమ్ అంత గాల్లో జంప్ లు , ఇవన్నీ ఎన్ని ఉన్నా, ఆ 100 ఫీట్ రానా విగ్రహం బద్దలు కొట్టి, తల పార్ట్ ని, బ్రిడ్జి లా చేసి… సెప్పను, ఏంచేసాడో, ఎవరి కాళ్ళ కింద సెట్ చేసాడో సెప్పను, చూసి తీరాల్సిందే.

11) క్లాసికల్ ఎండింగ్వారసత్వ రాజకీయం కదా, బాబు ప్లేస్ లో శివుడు సీట్ ఎక్కాడు. పక్కన అవంతిక సెటిల్ అయింది. అందరూ హ్యాపీ. ఒక్క రాజమౌళి తప్ప. ఆడియన్స్ కి ఎంత వారికి అర్ధమవుతుందో తెలీదు కానీ సినిమాని ఎక్కడైనా ఎండ్ చేసే ఆప్షన్ ఉన్నప్పటికీ, అసలు ఈ బాహుబలి కథ ఎక్కడ స్టార్ట్ అయింది? శివుడు శివలింగాన్ని మోసుకెళ్లి వాటర్ ఫాల్స్ కింద పెట్టగానే ఒక చెక్క ముక్క వచ్చి పడటం, అక్కడ నుండి కదా శివుడి జర్నీ అండ్ కథ లో మెయిన్ ఎలిమెంట్ స్టార్ట్ అయింది. సో కరక్ట్ గా అక్కడికే తీసుకొచ్చి కథని ఎండ్ చేయటం, రియల్లీ ఆ క్లాసికల్ ఎండింగ్. మాస్టర్, క్లాస్ థింకింగ్.

మొత్తానికి అది డూడ్స్. నాకు నచ్చిన పాయింట్స్. మీకు ఏమైనా నచ్చొచ్చు, అసలు నచ్చక పోవచ్చు. కానీ ఈ పైన లిస్ట్ చేసిన పాయింట్స్ బాలేవు అని మాత్రం ఒక్కడు కూడా అనలేదు. అసలు ఈ సినిమా హిట్టు అనిపించుకోవటానికి, వచ్చే ప్రతి రూపాయికి పిల్లర్స్ ఈ పాయింట్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా వేరే నచ్చినవి, నేను మిస్ అయినవి ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. లిస్ట్ లో యాడ్ చేద్దాం. జై మహిష్మతి, జై రాజమౌళి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus