హైదరాబాద్‌లో మరో భారీ మల్టీప్లెక్స్‌.. మీరు అనుకుంటున్న ఏరియాలో కాదు!

హైదరాబాద్‌ వాసులకు, దగ్గరలో ఉన్నవాళ్లు మాత్రమే ఈ న్యూస్‌. మిగిలిన వాళ్లకు సమాచారం మాత్రమే. ఎందుకంటే సినిమా చూడటం కోసం తరచుగా హైదరాబాద్‌ రాలేరుగా. అసలు విషయానికొస్తే.. నగరంలో 11 థియేటర్లతో ఓ పెద్ద మల్టీప్లెక్స్‌ సిద్ధమవుతోంది. ఈ మాట వినగానే ఎక్కడా మాదాపూరా? గచ్చిబౌలియా లేక కూకట్‌ పల్లినా అనే ప్రశ్న వచ్చేస్తుంది నగర వాసులకు. ఎందుకంటే ఇంత పెద్ద మల్టీప్లెక్స్ ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి.

అయితే సగటు హైదరాబాదీ ఊహించని విధంగా ఈ 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేస్తున్నారు. పెద్దగా మల్టీప్లెక్స్‌లు లేని ఓ ప్రాంతంలో ఇది రాబోతోంది. ఎల్‌బీ నగర్‌కి దగ్గరలో ఉన్న కర్మాన్ ఘాట్‌లో ఈ 11 స్క్రీన్ల సముదాయాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఇందులో మొత్తంగా 2700కుపైగా సీట్లు అందుబాటులో ఉంటాయంటున్నారు. ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న మల్టీప్లెక్స్‌ నగరంలో ఇదే అవుతుంది అని అంటున్నారు.

థియేటర్ వ్యవస్థ కాస్త కష్టాల్లో ఉంది అనుకుంటున్న ఈ సమయంలో ఇన్నేసి స్క్రీన్లతో మల్టీప్లెక్స్‌ రావడం కాస్త ఆలోచించాల్సిన విషయమే అయినా.. ఆ ప్రాంతం వారికి మాత్రం ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఎల్‌.బి.నగర్‌ దగ్గరలో అంత పెద్ద థియేటర్లు కానీ, మాల్స్‌ కానీ లేవు. దీంతో వీకెండ్‌ కష్టాలు తీరిపోతాయి అని అక్కడ జనాలు అనుకుంటున్నారు. అయితే ఈ మల్టీప్లెక్స్‌ను ఎవరు నిర్వహిస్తారు అనే విషయం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయమే.

ఎందుకంటే నగరంలోని కాస్ట్‌లీ ఏరియాలు, పాష్‌ ఏరియాలు అనే పేరున్న ప్రాంతాల్లో పెట్టి ధరలు, లెక్కలు మిగిలిన ప్రాంతాల్లో వర్కవుట్‌ కావు. దీంతో కొన్నిచోట్ల మల్టీప్లెక్స్‌లు జనాలు లేక వీక్‌ డేస్‌లో వెలవెలబోతున్నాయి. ఇలాంటి సమయంలో 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ క్లిక్‌ అవ్వాలంటే ఆలోచనలు వేరుగా ఉండాలి అంటున్నారు. ఇదంతా బిజినెస్‌ యాంగిల్‌ ప్రేక్షకుడి ఆలోచన అయితే.. కాస్త రిలాక్స్‌డ్‌గా సినిమాలు ఆస్వాదించొచ్చు అని.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus