11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే
- September 25, 2026 / 08:00 AM ISTByPhani Kumar
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(ఇప్పుడు సాయి దుర్గ తేజ్).. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో మంచి డెబ్యూ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'(Subramanyam for Sale) సినిమాని తెరకెక్కించాడు. ‘శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Subramanyam for Sale
‘గబ్బర్ సింగ్’ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే 2015 సెప్టెంబర్ 24న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కథ పాతగానే ఉన్నప్పటికీ హరీష్ శంకర్ టేకింగ్ ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఈ సెప్టెంబర్ 24కి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 5.8 cr |
| సీడెడ్ | 2.7 cr |
| ఉత్తరాంధ్ర | 1.9 cr |
| ఈస్ట్ | 1.5 cr |
| వెస్ట్ | 1.02 cr |
| గుంటూరు | 1.01 cr |
| కృష్ణా | 1.42 cr |
| నెల్లూరు | 0.72 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.07 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.38 Cr |
| ఓవర్సీస్ | 0.42 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 17.87 cr |
‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.17.87 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా ఈ సినిమా రూ.1.87 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.












