అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రూపొందిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించారు. 2020 సమ్మర్లో రావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది.
దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే 2021 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లకు వచ్చి బాగా చూశారు. టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఒకసారి ‘లవ్ స్టోరీ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 12.62 cr |
సీడెడ్ | 4.50 cr |
ఉత్తరాంధ్ర | 3.15 cr |
ఈస్ట్ | 1.74 cr |
వెస్ట్ | 1.48 cr |
గుంటూరు | 1.59 cr |
కృష్ణా | 1.50 cr |
నెల్లూరు | 0.94 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 27.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.54 Cr |
ఓవర్సీస్ | 5.10 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 35.16 cr |
‘లవ్ స్టోరీ’ చిత్రం రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.35.16 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా ఈ సినిమా రూ.3.16 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి సూపర్ హిట్ గా నిలిచింది. జనాలు థియేటర్లకు రావడం తగ్గించేసిన టైంలో, అదీ టికెట్ రేట్లు బాగా తక్కువగా ఉన్న టైంలో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.