ఈ ఏడాది ‘ఖిలాడి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఆ చిత్రంతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఆ ప్లాప్ ను మరిపించేందుకు త్వరలోనే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉండగా.. రవితేజ మరో పక్క ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం షూటింగ్ లో భాగంగా ఇతను గాయాల పాలైనట్లు తెలుస్తుంది.
విషయంలోకి వెళ్తే.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం షూటింగ్లో భాగంగా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రోప్ స్కిడ్ అవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే సిబ్బంది హాస్పిటల్ కు తరలించగా… రవితేజ చేతికి 10 కుట్లు వేశారట వైద్యులు. రెండు నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి అని వైద్యులు సూచించారట. కానీ రవితేజ మాత్రం రెండు రోజులకే షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు.
తాను కమిట్ అయిన ప్రాజెక్టులను చకచకా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రవితేజ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే నిర్మాతకి నష్టాలు రాకుండా రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నందుకు అతని పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని వంశీ కృష్ణ ఆకెళ్ళ డైరెక్ట్ చేస్తున్నాడు.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!