12th Fail: చిన్న సినిమా అందరి నోర్లు మూయించి.. రూ.70 కోట్లు కలెక్ట్ చేసిందట!

మేకర్స్ అయినా, ఫిలిం క్రిటిక్స్ అయినా.. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఇలాంటి ఫలితాన్ని సాధిస్తుంది అని అంచనా వేసి పక్కాగా చెప్పలేరు అనేది వాస్తవం. ‘పటాస్’ లాంటి సినిమా కొంతమంది క్రియేటర్స్ కి రిలీజ్ కు ముందు షోలు వేస్తే.. ఇది ‘కచ్చితంగా డిజాస్టర్ అయ్యే సినిమా’ అని దర్శకుడు అనిల్ రావిపూడితో అన్నారట. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ‘పెళ్ళిచూపులు’ సినిమాని కూడా రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ఏ బయ్యర్ ముందుకు రాలేదు.

కానీ ఆ సినిమా రూ.15 కోట్ల షేర్ ను ఫుల్ రన్లో రాబట్టి… అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఓ బాలీవుడ్ సినిమా గురించి. అదే ’12th ఫెయిల్’. ప్రముఖ నిర్మాత విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన మూవీ ఇది. గతంలో ఇతను రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ ‘లగేరహో మున్నాభాయ్’ ‘పీకే’ ‘3 ఇడియట్స్’ ‘సంజు’ వంటి సినిమాలని నిర్మించారు.

12th ఫెయిల్ (12th Fail) సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలి అని ఈయన అనుకున్నప్పుడు దీనికి ‘రూ.30 లక్షలు కూడా రావు, డిజిటల్ రిలీజ్ చేసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారట. కానీ ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఓటీటీలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus