Bigg Boss 5 Telugu: ఈవారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో రవి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 13వ వారానికి నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా కెప్టెన్ షణ్ముక్ తప్పించి మిగతా ఇంటి సభ్యులైన ఆరుగురు రెండు టీమ్స్ గా విడిపోయారు. ఈ టీమ్స్ లో సన్నీ, సిరి, పింకీలు ఒక టీమ్ గా ఉంటే, శ్రీరామ్, మానస్ , కాజల్ ఇంకో టీమ్ లో ఉన్నారు. ఒక టీమ్ ఇంకో టీమ్ మెంబర్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఒకరినొకరు నామినేట్ చేస్కోవాలి.

వాళ్ల బాస్కెట్ లో ఉన్న బాల్స్ ని తంతూ గేట్ బయటకి విసిరేయాలి. ఇక్కడే ఆర్గ్యూమెంట్స్ తో హౌస్ వేడెక్కిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఇక 13వ వారం వచ్చింది కాబట్టి, నామినేషన్స్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈవారం షణ్ముక్ కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ లో లేడు. అలాగే, సన్నీ కూడా నామినేషన్స్ లో లేడని సమాచారం తెలుస్తోంది. ఒక టీమ్ నుంచీ సిరి, ఇంకా ప్రియాంకలు నామినేట్ అయ్యారు.

అలాగే, మరో టీమ్ లో శ్రీరామ్, కాజల్, మానస్ లు నామినేట్ అయ్యారు. సన్నీ సేఫ్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, ఇక్కడే కెప్టెన్ పవర్ ఉపయోగించి ఎవర్ని అయినా సేఫ్ చేయమని షణ్ముక్ కి చెప్పారా అనేది బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడా అనేది ఎపిసోడ్ చూస్తునే కానీ తెలియదు. ఇక సన్నీని అపోజిట్ టీమ్ ఎవరూ కూడా నామినేట్ చేయలేదు. ఎందుకంటే, మానస్ ఇంకా కాజల్ ఇద్దరూ వేరే టీమ్ లో ఉండటం అనేది సన్నీకి ప్లస్ అయ్యింది.

అలాగే, శ్రీరామ్ కూడా సన్నీని నామినేట్ చేయలేదని సమాచారం. ఏది ఏమైనా హౌస్ మేట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హింట్స్ ఇవ్వడం, అలాగే రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోవడం అనేది హౌస్ మేట్స్ ని ఇంకా ఆలోచింపజేసేలా అయ్యింది. అందుకే ఈవారం ఎవరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus