OTT Releses: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్!

నవంబర్ అనేది టాలీవుడ్ బాక్సాఫీస్ కు అన్ సీజన్ అని అంతా అంటుంటారు. అయినప్పటికీ ఈ నెలలో మూడు హిట్లు పడ్డాయి. ‘యశోద’ ‘గాలోడు’ ‘మసూద’ వంటి సినిమాలు బాగానే కలెక్ట్ చేశాయి. అయితే వాటి బడ్జెట్, బిజినెస్ అంతంత మాత్రం కాబట్టి సేఫ్ అయ్యాయి. పెద్ద సినిమాలు వస్తే బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఏది ఏమైనా ఈ నెలలో కూడా జనాలు ఎక్కువగా ఓటీటీలకే ఓటేశారన్నది వాస్తవం. టికెట్ కొనుక్కుని థియేటర్ కు వెళ్లడం కంటే.. ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి సినిమా చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇక ఈ వారం థియేటర్లలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి పేరున్న సినిమా తప్ప.. చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అందుకే అందుకే జనాల చూపు మళ్ళీ ఓటీటీల పై పడింది. మరి ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మీట్ క్యూట్ : నాని సోదరి దీప్తి దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్ రూపొందింది. నాని నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్ 5 ఎపిసోడ్ లు గా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. సత్యరాజ్, రుహానీ శర్మ, వర్ష బొల్లమ్మ, అశ్విన్ కుమార్, రోహిణి, ఆకాంక్ష సింగ్, అదా శర్మ, శివ కందుకూరి వంటి వారు నటించిన ఈ సిరీస్ నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది.

2) ‘అన్‌స్టాపబుల్ 2’ 4వ ఎపిసోడ్ : ‘ఆహా’ కోసం బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షోకి కొంత బ్రేక్ వచ్చింది. అయితే ఇక బ్రేక్ లు ఉండవు అని టీం వెల్లడించింది. ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కాబోయే 4వ ఎపిసోడ్ కు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కె ఆర్ సురేష్ రెడ్డి, రాధిక శరత్ కుమార్ లు గెస్ట్ లు గా వచ్చి సందడి చేయబోతున్నారు.

3) కాంతార : చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

4)ప్రిన్స్ : శివ కార్తికేయన్ హీరోగా జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అయితే నవంబర్ 25 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.మరి ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..!

5)గర్ల్స్ హాస్టల్ సీజన్ 3 : ఈ హిందీ వెబ్ సిరీస్ నవంబర్ 25 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) లాస్ట్ ఫిలిం షో : ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లి చాలా పాపులర్ అయిన గుజరాతి సినిమా ‘ది లాస్ట్ ఫిలిం షో'(చెల్లో షో) నవంబర్ 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) పాడవెట్టు : నివిన్ పౌలీ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మలయాళ సినిమా నవంబర్ 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ : ‘అవర్ మెక్సికన్ అపారధ’ అనే మలయాళం మూవీకి తెలుగు వెర్షన్ ఇది. నవంబర్ 25 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

9) చుప్ : ఈ హిందీ మూవీ నవంబర్ 25 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

10) ఖాకీ ది బీహార్ చాప్టర్ : ఈ హిందీ సిరీస్ సీజన్ 1 నవంబర్ 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

11) గుడ్ నైట్ ఒప్పీ : అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

12) గిస్లైన్ మాక్స్ వెల్ – ఫిల్థీ రిచ్ : నవంబర్ 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.

13) ది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ : ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

14) వెన్స్ డే : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus