మన తెలుగు సినిమాల విషయానికి వస్తే ప్రతీ హీరోకి దాదాపుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బడా హీరోలకైతే భక్తులే ఉన్నారు. అదే క్రమంలో ప్రతీ ఏడాది చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకూ తమకు వీలైనన్ని సినిమాలు చేసి అభిమానుల్ని ఆకట్టుకుంటుంటారు. అలాగే 2016లో కూడా బడా హీరోల నుంచి బుల్లి హీరోల వరకూ అందరూ తమ స్థాయి మేరకు ప్రేక్షకులను అలరించిన వారే. అటువంటి హీరోల సక్సెస్, ఫెయిల్యూర్ పై ఫోకస్..
“నటసింహం” బాలకృష్ణఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో దూకి దుమ్ము దులిపాడు బాలయ్య. ‘డిక్టేటర్’గా సంక్రాంతి కానుకగా అభియానులను అలరించాడు. అయితే ఈ ఏడాది తొలి రోజు నుంచే బాలయ్య 100వ సినిమాపై ఆలోచనలో పడ్డారు అభిమానులు, ఏ దర్శకుడితో, ఎప్పుడు, ఏ కథతో సినిమా మొదలు అవుతుంది? అని ఎదురు చూశారు. ఎవ్వరూ ఊహించని విధంగా చరిత్ర పుటలను తవ్వి మరీ, మహారాజు చరిత్రను తెరకెక్కించే సాహసం చేశారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ అంటూ 2017 సంక్రాంతికి దూసుకొస్తున్నాడు నట సింహం.
“యంగ్ టైగర్” ఎన్టీఆర్టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎన్టీఆర్ స్థానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన నటనకు యావత్ సినీ ప్రపంచం బ్రహ్మరధం పడుతోంది. గత కొన్నేళ్ళుగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఈ ఏడాది తన ఆకలి తీర్చుకున్నాడు. సంక్రాంతికి “నాన్నకు ప్రేమతో”తో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా, 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాడు. అదే క్రమంలో సెప్టెంబర్ లో “జనతా గ్యారేజ్” సినిమాతో వచ్చి రికార్డులన్నింటికీ రిపేరు చేసాడు. ఈ మూవీ 135 కోట్లను రాబట్టింది.
“ప్రిన్స్” మహేష్ బాబుగత ఏడాది “శ్రీమంతుడు”తో టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన ప్రిన్స్ ఈ ఏడాది విజయాల బాటలో కాస్త వెనుక బడ్డాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన “బ్రహ్మోత్సవం” ఆకట్టుకోలేక పోయింది. అయితే సూపర్ స్టార్ వెనకడుగు వెయ్యకుండా మురుగుదాస్ తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో మనముందుకు రాబోతున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఈ ఏడాది పెద్దగా కలసి రాలేదు. గత ఏడాది గోపాల..గోపాలతో హిట్ అందుకున్న పవన్, ఈ ఏడాది సొంత దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ విషయం పక్కన పెట్టి వరుసగా సినిమాలు చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశారు.
“స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్2015లో రెండు సినిమాలు చేసిన బన్నీ…ఆ రెండు పెద్దగా హిట్ కాకపోవడంతో, 2016లో డాషింగ్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో “సరైనోడు”గా అభిమానులను అలరించాడు. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం గా ఒకే చిత్రంలో కామెడీ, యాక్షన్ చూపించడానికి శ్రమిస్తున్నాడు.
“మెగాపవర్ స్టార్” రామ్ చరణ్ తేజ్నాయక్ (2014 ) తరువాత రామ్ చరణ్ తేజ్ కి పెద్ద హిట్ లేదు. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ అపజయం పాలవడంతో చెర్రీ కసిగా చేసిన చిత్రం ధృవ. తమిళ తని ఒరువన్ ను రీమేక్ గా వచ్చిన ఈ మూవీ మెగా పవర్ స్టార్ ని హిట్ ట్రాక్ లోకి రప్పించింది.
“విక్టరీ” వెంకటేష్టాలీవుడ్ లో హిట్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య సినిమాల రేస్ లో వెనుకబడ్డాడు. ఈ ఏడాది కేవలం ఒకే ఒక సినిమా “బాబు బంగారం”తో బరిలో దిగిన వెంకీ అభిమానులను నిరాశ పరిచాడు. ఇప్పుడు “గురు”గా దుమ్ము రేపేందుకు బరిలోకి దిగనున్నారు.
“కింగ్” నాగార్జునటాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునకు ఈ ఏడాది బాగా కలసి వచ్చింది. ఈ ఏడాది నాగ్ పట్టింది అంతా బంగారం అయ్యింది. సంక్రాంతి బరిలో నాగ్ సొగ్గాడే చిన్ని నాయన చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తరువాత ఊపిరితో మరో విజయం అందుకున్నాడు.
“నేచురల్ స్టార్” నానిఈ ఏడాది నాని చాలా బిజీ హీరోగా గడిపాడు. “కృష్ణగాడి వీర ప్రేమ గాధ” అంటూ హిట్ అందుకున్న నాని, వెంటనే “జెంటిల్ మ్యాన్”తో మరో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన “మజ్ను” యావేరేజ్ గా నిలిచి మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరుని సొంతం చేసుకున్నాడు.
“యూత్ హీరో” నితిన్టాలీవుడ్ యూత్ హీరోల్లో ఒకరైన నితిన్, అఖిల్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ లోటును పూడ్చడానికి ‘త్రివిక్రమ్’తో ‘అ..ఆ’గా అవతారం ఎత్తాడు. అయితే హీరోయిజం చూపించే సినిమా కాకపోయినా, త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లే ను తీర్చిదిద్ది సినిమాను సూపర్ హిట్ గా నిలిపాడు.
యువ సామ్రాట్ నాగ చైతన్యభారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ప్రేమమ్ ఒకటి. మరొకటి సాహసం శ్వాసగా సాగిపో. ప్రేమమ్ సూపర్ హిట్ కాగా, సాహసం శ్వాసగా సాగిపో విమర్శల ప్రశంసలు అందుకుంది.
సాయి ధరమ్ తేజ్మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలు చేశాడు. అందులో సుప్రీం సూపర్ హిట్ అందుకోగా, తిక్క బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
కల్యాణ్ రామ్నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఈ ఏడాది ఒకే సినిమా చేశారు. అటు హీరోగా సిక్స్ ప్యాక్ కోసం కష్టపడ్డారు. ఇటు నిర్మాతగా భారీ మొత్తాన్ని సమకూర్చారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన “ఇజం” ఏ విధంగానూ కళ్యాణ్ రామ్ కి సంతృప్తి ఇవ్వలేక పోయింది.
సందీప్ కిషన్యువ హీరో సందీప్ ఈ ఏడాది రెండు డిఫరెంట్ మూవీస్ లో కనిపించాడు. అందులో ఒకటి రన్ కాగా, మరొకటి ఒక్క అమ్మాయి తప్ప. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యలేదు. ఇక ఇప్పుడు కృష్ణ వంశీ “నక్షత్రం”లో నటిస్తున్నాడు.
మంచు మనోజ్మంచు మనోజ్ ఈ ఏడాది శౌర్య, ఆటాక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అన్నాయి. గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాలతో సత్తా చాటనున్నారు.