OTT Releases: థియేటర్లను మించిన ఎంటర్టైన్మెంట్.. రేపు ఒక్క రోజే 15 సినిమాలు..!

  • September 1, 2022 / 08:05 PM IST

ప్రతీవారం థియేటర్లతో పోటీపడుతున్నాయి ఓటీటీలు. ఇంకా చెప్పాలి అంటే థియేటర్లో కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పాలి.థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకి ఏమాత్రం టాక్ తేడాగా వచ్చినా ఆ వీకెండ్ మొత్తం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలతోనే జనాలు టైం పాస్ చేస్తున్నారు. పెరిగిన నిత్యావసరాల ఖర్చులతో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఇష్టపడటం లేదు.కొంతమంది థియేటర్లలో మిస్ అయిన సినిమాలను కూడా ఓటీటీల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కూడా ఓటీటీలకే పెద్ద పీట వేస్తున్నారని చెప్పాలి. అందుకే ఓటీటీ సంస్థలు కూడా కొత్త సినిమాల డిజిటల్ రైట్స్ ను ఎక్కువ రేటు చెల్లించి మరీ దక్కించుకుంటున్నాయి.

ఇది పక్కన పెడితే ఈ సెప్టెంబర్ 2న థియేటర్లలో ‘రంగ రంగ వైభవంగా’, ‘బుజ్జీ ఇలా రా’ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీల్లో అయితే ఏకంగా 12 సినిమాలు/వెబ్ సిరీస్ ల వరకు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)LOTR 2 Eps : ఈ మూవీ/సిరీస్ ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 2 ఉదయం 5:30 నిమిషాల నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

2)కాట్టేరి : ఈ మూవీ/సిరీస్ తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో సెప్టెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

3)ఫాబ్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ఎస్ 2: ఈ సిరీస్ ఇంగ్లీష్, మరియు హిందీ వెర్షన్లలో సెప్టెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4)కట్ పుట్లి : ఈ హిందీ మూవీ/సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

5)విక్రాంత్ రోణ : సుదీప్ హీరోగా నటించిన ఈ మూవీ కన్నడ వెర్షన్ జీ5 లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

6)ఖుదా హఫీజ్ 2 :ఈ హిందీ సిరీస్ జీ5 లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

7)రాజ్ డాల్ : ఈ ఇంగ్లీష్ మూవీ బి.ఎం.ఎస్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

8)సకుటుంబ సమేత : ఈ కన్నడ మూవీ వూట్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

9)షేర్ వుడ్ ఎస్ 1 : ఈ ఇంగ్లీష్ మూవీ బి.ఎం.ఎస్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

10)అన్ ఫర్గాటెన్ ఎస్ 1: ఈ ఇంగ్లీష్ మూవీ బి.ఎం.ఎస్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

11) డేగల బాబ్జి : బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 2 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

12) వాంటెడ్ పండుగాడ్ : ఈ మూవీ సెప్టెంబర్ 2 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

13)ఆపరేషన్ మిన్స్ మీట్ : ఈ ఇంగ్లీష్ మూవీ బి.ఎం.ఎస్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

14)మై డియర్ భూతం : ఈ మూవీ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 2 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది

15)సుందరి గార్డెన్స్ : ఈ మూవీ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 2 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus