సీనియర్ కోలీవుడ్ యాక్టర్ శివ కుమార్ పెద్ద కొడుకు సూర్య తమిళనాట హీరోగా ఎంట్రీ ఇచ్చి.. సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్ల పరంగా వైవిధ్యం చూపుతూ.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ‘శివపుత్రుడు’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఇక్కడ కూడా మార్కెట్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.. తండ్రి, అన్నయ్యలను ఆదర్శంగా తీసుకుని కార్తి కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. సూర్య, త్రిష జంటగా నటించగా..
సూపర్ హిట్ అయిన ‘మౌనం పేసియదే’ (Mounam Pesiyadhe) (తెలుగులో ‘కంచు’ పేరుతో డబ్ అయింది) మూవీతో దర్శకుడిగా పరిచయమైన అమీర్ డైరెక్షన్‌లో.. కార్తిని హీరోగా పరిచయం చేస్తూ.. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద సూర్య కజిన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘పరుత్తి వీరన్’ (Paruthiveeran).. ప్రియమణి కథానాయిక.. పొన్వన్నన్, గంజ కరుప్పు, సుజాత శివ కుమార్, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు.. యువన శంకర్ రాజా సంగీతమందించాడు..
సాధారణంగా తమిళనాడు వాళ్లు తమ సినిమాల్లో వాస్తవిక సంఘటనలకు, పల్లెటూరి నేపథ్యం, సంసృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంటారు.. అలా తెరకెక్కిన సినిమానే ఇది.. స్టోరీ, ప్లే, క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్, సిచ్చువేషన్స్ అన్నీ నేచురల్‌గా ఉంటాయి.. కులాల మధ్య వర్గ పోరు, ప్రేమని ఒప్పుకోని పెద్దలు.. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు కోల్పోవడానికి జనం దృష్టిలో హీరో విలన్‌గా మారడం.. ఇలా ఊహించని విధంగా ఉంటుంది సినిమా.. చెప్తే అర్థం కాదు కానీ చూసి తీరాల్సిందే.. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అనిపించుకున్నారు కార్తి, ప్రియమణి..
తన సహజమైన నటనకు గానూ నేషనల్ అవార్డ్ అందుకుంది.. దీంతో పాటు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్‌తో సహా పలు అవార్డులు, రివార్డులు గెలుకుందీ చిత్రం.. 2007 ఫిబ్రవరి 23న విడుదలైన ‘పరుత్తి వీరన్’ 16 ఏళ్ల క్రితమే రూ. 22 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయం సాధించింది.. కార్తి ‘యుగానికొక్కడు’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘ఆవారా’, ‘నాపేరు శివ’ తో ఇక్కడ హ్యాట్రిక్ కొట్టి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్న టైంలో ‘మల్లిగాడు’ పేరుతో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు కానీ అనుకున్నంతగా ఆడలేదు..
#16YearsOfParuthiveeran – @Karthi_Offl debuted with a critically acclaimed BB with 22cr share way back in 2007 (16 years back). If it released today,