Nithiin, Anupama: నిఖిల్‌ – అనుపమ సినిమాపై కొత్త రూమర్స్‌.. నిజమేనా?

18 పేజెస్‌.. నిఖిల్‌ – అనుపమ పరమేశ్వరన్‌ జంటగా సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. ఈ లైన్‌ మీరు చాలా రోజుల క్రితమే చదివి ఉంటారు. ఒకసారి కాదు, రెండుసార్లుకాదు.. చాలాసార్లు చదివి ఉంటారు. దీనికి కారణం ఈ సినిమా షూటింగ్‌ మొదలై చాలా రోజులైంది. మధ్యలో ఆగి, మళ్లీ మొదలై.. ఇలా సాగుతూనే ఉంది. అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. దీంతో హమ్మయ్య ఇకనైనా ఆ సినిమా చూస్తామా అనుకుంటే..

మళ్లీ షూటింగ్‌ చేస్తున్నారని టాక్‌ వినపిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్ నిర్మిస్తున్న ’18 పేజేస్’ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. అప్పటికే షూటింగ్‌ మొత్తం అయిపోవడంతో ఇక ప్రచారం మొదలుపెట్టడమే ఆఖరు అని అనుకున్నారు. అయితే కొంత వర్క్‌ చేయాల్సి ఉందని, పెండింగ్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అని అప్పుడు టీమ్‌ నుండి సమాచారం వచ్చింది. దీంతో ప్యాచ్‌ వర్క్‌ ఏమో అనుకున్నారు.

కానీ ఇప్పుడు చూస్తే రీషూట్లు జరుగుతున్నాయని టాక్‌. అలాగే పాటల విషయంలో హైప్‌ కోసం శింబుతో పాడించారు అని కూడా అంటున్నారు. గతంలో టీమ్‌ చెప్పిన దాని ప్రకారం పాటలేమీ పెండింగ్‌లో లేవు. కానీ ఇటీవల శింబుతో ఓ పాట పాడించారు. ‘టైమ్‌ ఇవ్వు పిల్ల..’ అంటూ శింబు వచ్చి టైమ్‌ ఇచ్చి, పాడి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఆ పాట మళ్లీ తీస్తారా? లేక పాతదే పెట్టేస్తారా అనేది తెలియడం లేదు.

ఆ విషయం పక్కన పెడితే సినిమా విడుదలకు మూడు వారాలే ఉన్న ఈ టైమ్‌లో రీషూట్‌ ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే సినిమా చూసిన అల్లు అరవింద్‌, సుకుమార్‌ కొన్ని మార్పులు చెప్పారట. అవే ఇప్పుడు మారుస్తున్నారని టాక్‌. సినిమా విడుదలకు దగ్గరలో ఇలాంటి మార్పులు ఇబ్బంది పెడతాయేమో అనే డౌట్‌ నిఖిల్‌ అభిమానుల్లో ఉంది. ఎందుకంటే ‘కార్తికేయ 2’ సినిమాతో ఆయన ఇటీవల మంచి విజయం అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus