స్టార్ రైటర్ ఆల్ టైం రికార్డు..!

‘జ‌బ‌ర్‌ద‌స్త్’ లో స్కిట్లు రాసుకొంటూ పాపులర్ అయ్యాడు ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌(Prasanna Kumar).అతనిలోని టాలెంట్ ను గుర్తించి బాగా క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టాడు దర్శకుడు త్రినాథ‌రావు నక్కిన. ప్రసన్న కుమార్ అతని టీంలో జాయిన్ అయ్యాకే త్రినాథ్ రావ్ నక్కిన  (Trindha Rao)  డిమాండ్ కూడా పెరిగింది అని చెప్పాలి. ‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ (Nenu Local)  ‘హ‌లో గురూ ప్రేమ కోస‌మే'(Hello Guru Prema Kosame) … ఇలా వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమాలు అన్నీ హిట్లే. ‘ధ‌మాకా’ (Dhamaka)  తో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ లీగ్లోకి ఎంటర్ అయ్యారు.

Prasanna Kumar Bezawada

ఆ సినిమా తర్వాత ప్ర‌స‌న్న కుమార్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) సినిమాకి ముందుగా ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఆ సినిమా కథ విషయంలో వివాదాలు జరగడంతో ప్రసన్న కుమార్ ని పక్కన పెట్టి విజయ్ బన్నీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు నాగార్జున  (Nagarjuna) .దీంతో మళ్ళీ ప్రసన్న త్రినాధ్ రావ్ వద్ద రైటింగ్ సెక్షన్లో పని చేయాల్సి వస్తుంది.

అయితే ఇది వరకు ఒక్కో సినిమాకి కోటి, కోటిన్నర తీసుకునే ప్రసన్న కుమార్.. ఇప్పుడు రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. సందీప్ కిషన్ తో  (Sundeep Kishan)  చేస్తున్న `మ‌జాకా` సినిమాకి గాను ప్రసన్నకుమార్ కి రూ.2.5 కోట్లు పారితోషికం ఇస్తున్నాడట నిర్మాత రాజేష్ దండ. ఇక దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కినకి రూ.5 కోట్లు పారితోషికం ఇస్తున్నారట. ఏదేమైనా రైటర్స్ లో ఎక్కువ పారితోషికం అందుకుంటుంది మాత్రం ప్రసన్న అనే చెప్పాలి.

‘జన నాయగన్’ ఫస్ట్ లుక్.. పెద్ద డిస్కషన్ కి దారి తీసిందిగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus