ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు కారణమైన సీరియల్ ఏదంటే..

  • February 1, 2023 / 06:55 PM IST

మనుషులం కదా.. కొన్ని కొన్ని ఎమోషన్స్‌ని అంత త్వరగా కంట్రోల్ చేసుకోలేం. కోపం, చిరాకు, సంతోషం, బాధ.. ఏదైనా బయట పెట్టేస్తుంటాం.. ఒక్కోసారి మనకు నచ్చిన పనికి ఎవరైనా అడ్డు చెెప్తే.. వారి మీద దాడి చేయడానికి కూడా వెనుకాడం.. అలా తనకిష్టమైన టీవీ సీరియల్ చూస్తుంటే విసిగిస్తున్నాడని.. ఓ వ్యక్తి కోపంతో మరో వ్యక్తి వేలు కొరికేశాడు. చదవడానికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఈ సంఘటన నిజంగానే జరిగింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

‘కార్తీక దీపం’ సీరియల్ ఎంతటి స్థాయిలో సూపర్ హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్‌కు మహిళలే కాదు, మగవాళ్లు, పిల్లలు, వృద్ధులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఇందులో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, చిన్న పిల్లల క్యారెక్టర్లను తమ ఇంట్లో మనుషుల్లాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీరియల్‌కు ఎండ్ కార్డు పడింది. మరి ఇంతటి ఆదరణ దక్కించుకున్న ధారావాహిక చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది కదా.. అందుకే విసిగిస్తున్న వ్యక్తి వేలు కొరికేశాడు మరో వ్యక్తి..

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిళి కిరాణ కొట్టు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య గత నెల 23 రాత్రి మద్యం సేవించి మొగిళి కొట్టకు వెళ్లి అరువు అడిగాడు. అదే సమయంలో ‘కార్తీక దీపం’ చివరి ఎపిసోడ్ ప్రసారం కానుండటంతో మొగిళి సీరియల్ చూడటంలో లీనమయ్యాడు. సీరియల్ చూశాకే అరువునిస్తానని చెప్పినా.. వినిపించుకోకుండా వెంకటయ్య విసిగించసాగాడు. దీంతో కోపమొచ్చిన మొగిళి.. వెంకటయ్యపై దాడి చేసి అతడి వేలు కొరికేశాడు.

ఈ ఘటనపై వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ నిమిత్తం మొగిళిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. తనను ‘కార్తీక దీపం’ సీరియల్ చూడనియ్యకుండా విసిగించడంతోనే వెంకటయ్య వేలు కొరికినట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో అతడిపై 290, 324లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus