ఒక సినిమా హిట్ అవుతుందా.. ? ప్లాప్ అవుతుందా అనేది స్క్రిప్ట్ దశలో అంచనాలు వెయ్యడం కష్టం. షూటింగ్ సమయంలో కూడా అంతగా అంచనా వెయ్యలేము. కానీ రషెస్ చూసినప్పుడు మాత్రం ఓ అంచనా వేసే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అది కూడా కష్టమేనేమో..! కథ, కథనాలతో పాటు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కూడా ఆ సినిమా ఉండాలి. లేదంటే ఆ సినిమాని వారు ఆదరించడం కష్టం.
ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండేలా దర్శకులు చూసుకోవాలి. ఏ ఒక్కటి తక్కువైనా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. అంతేకాదు.. పెద్ద హీరో సినిమా విడుదలవుతుంది అంటే.. అతని గత సినిమా రిజల్ట్ కూడా.. విడుదలవుతున్న సినిమా పై ఉంటుంది. అందుకు తగినట్టుగా ప్లాన్ చేసుకుని విడుదల చేసుకోవాలి అని అప్పటి దర్శకులు చెబుతుంటారు. బహుశా ఇలాంటివి తక్కువయ్యే మన నందమూరి బాలకృష్ణ సినిమాలు కొన్ని ఘోరంగా ప్లాప్ అయినట్టు ఉన్నాయి. డైరెక్టర్లు ఏం చెబితే అది గుడ్డిగా చేసేస్తాడు బాలయ్య.
అందుకే అతన్ని ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలకు వాడుకున్నారేమో అనిపిస్తుంది.. అతను నటించిన కొన్ని సినిమాలు చూస్తుంటే..! బాలకృష్ణ నుండీ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో పాటు అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఏ హీరోకి అయినా హిట్టు.. ప్లాప్ అనేది సర్వసాధారణం. కానీ బాలయ్య నటించిన కొన్ని సినిమాలు మాత్రం ఆయన ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1)జననీ జన్మభూమి
2)కత్తుల కొండయ్య
3)అల్లరి కృష్ణయ్య
4)సాహస సామ్రాట్
5)ప్రాణానికి ప్రాణం
6)బ్రహ్మర్షి విశ్వామిత్ర
7)గాండీవం
8)నిప్పు రవ్వ
9)దేవుడు
10)కృష్ణ బాబు
11)వంశోద్ధారకుడు
12)పలనాటి బ్రహ్మానాయుడు
13)విజయేంద్ర వర్మ
14)అల్లరి పిడుగు
15)వీరభద్ర
16)శ్రీమన్నారాయణ
17)మహారథి
18)ఒక్క మగాడు
19) పరమ వీర చక్ర
20) రూలర్