Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Focus » Horror Movies: జగన్మోహిని నుంచి విరూపాక్ష.. టాలీవుడ్ లో వచ్చిన 20 హర్రర్ సినిమాలు ఇవే!

Horror Movies: జగన్మోహిని నుంచి విరూపాక్ష.. టాలీవుడ్ లో వచ్చిన 20 హర్రర్ సినిమాలు ఇవే!

  • April 29, 2023 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Horror Movies: జగన్మోహిని నుంచి విరూపాక్ష.. టాలీవుడ్ లో వచ్చిన 20 హర్రర్ సినిమాలు ఇవే!

హర్రర్ అంటే భయం అనేది మన మనస్సులో, మైండ్ లో ఎప్పుడు ఆలోచన ఉంటుంది. కానీ సినిమా ప్రపంచంలో భయానికి కామెడీని జోడించి సినిమాలు చేయడంతో భయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం.. కొన్ని హర్రర్ సినిమాలు చూసే సమయంలో మనం భయపడుతూ ఉంటాం..తరువాత అది కామెడి అని నవ్వుకుంటాం..అలాంటి సినిమాల మన బాలీవుడ్ లో కూడా తీశారు…ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

1. జగన్మోహిని

జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన విఠలాచార్య ఈ సినిమాను 1978లో నిర్మించి, తానే స్వయంగా దర్శకత్వం వహించారు. నరసింహరాజు, జయమాలిని, ప్రభ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. పూర్తి స్థాయి హారర్ చిత్రంగా అప్పట్లోనే ఈ చిత్రం ఆదరణ పొంది సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. టెక్నాలజీ కూడా పెద్దగా లేని ఆ రోజుల్లో విఠలాచార్య చేసిన పలు కెమెరా ట్రిక్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడవచ్చు.

2. కాష్మోరా

యండమూరి వీరేంద్రనాథ్ కలం నుండి జాలువారిన “తులసి” నవల ఆధారంగా 1986లో ఎన్ బి చక్రవర్తి దర్శకత్వం వహించిన చిత్రం “కాష్మోరా”. చేతబడి లాంటి మూఢనమ్మకాలపై అప్పట్లో తీసిన ఈ చిత్రం ఎన్నో చర్చలకు కూడా దారి తీసింది. సైన్స్ ప్రాముఖ్యతను గురించి కూడా ఈ చిత్రంలో దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించడం గమనార్హం.

3. రాత్రి

1992లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “రాత్రి” చిత్రం కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇందులో రేవతి, ఓంపురి, అనంత్ నాగ్ మొదలైన వారి నటన సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు.

4. మంత్ర

23mantra-movie

2007లో తులసీ రామ్ దర్శకత్వంలో ఛార్మీ ప్రధాన పాత్రలో నటించిన “మంత్ర” చిత్రం కూడా సూపర్ హిట్ హర్రర్ చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రంలో నటనకు గాను ఛార్మీ 2007లో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇదే చిత్రానికి 2015లో సీక్వెల్ కూడా తీయడం జరిగింది.

5. ప్రేమకథా చిత్రమ్

2013లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కినా హర్రర్ కామెడీ సినిమా “ప్రేమకథా చిత్రమ్” బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా నటించినప్పటికీ.. సప్తగిరి కామెడీ సినిమాకి ప్రధాన అసెట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సప్తగిరి కూడా మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

6. అవును

Avunu

2012లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన “అవును” చిత్రం హారర్ చిత్రాలలోనే ఒక స్పెషల్ చిత్రమని చెప్పుకోవచ్చు. కెప్టెన్ రాజు అనే ఓ ఆగంతకుడి ఆత్మ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానరుపై రవిబాబు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది. ఇదే చిత్రానికి తర్వాత సీక్వెల్ కూడా వచ్చింది.

7. రక్ష

2008లో వచ్చిన “రక్ష” అనే హర్రర్ చిత్రానికి వంశీక్రిష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. ఆజామ్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. యండమూరి నవల “తులసిదళం” ప్రేరణతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జగపతిబాబు ఈ చిత్రంలో హీరోగా నటించారు.

8. ఆ ఇంట్లో

2009లో వచ్చిన “ఆ ఇంట్లో” సినిమాకి నటుడు చిన్నా దర్శకత్వం వహించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాగానే వసూళ్లను రాబట్టింది. కానీ.. ఈ చిత్రం తర్వాత చిన్నా ఏ ఇతర చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు.

9. రాజు గారి గది

ఓంకార్ దర్శకత్వంలో 2015లో తెరకెక్కిన చిత్రం “రాజు గారి గది”. పూర్తిస్థాయి హర్రర్ కామెడి చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు ఆశ్విన్ బాబు కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం బాగానే సక్సైయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2017లో “రాజు గారి గది 2” చిత్రాన్ని తీశారు ఓంకార్. ఈ చిత్రంలో నాగార్జున, సమంత నటించారు.

10. ఆనందో బ్రహ్మ

Anando Brahma

2017లో విడుదలైన హర్రర్ కామెడీ చిత్రం “ఆనందో బ్రహ్మ”కి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. భయానికి నవ్వంటే భయం అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. మనుష్యులను చూసి దెయ్యాలు భయపడితే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు.

11. చంద్రముఖి

సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’. ఇది సీనియర్ యాక్టర్ విష్ణు వర్ధన్ నటించిన ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి అధికారిక రీమేక్. 2005 లో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రజినీ ఏంటి, హారర్ కామెడీలో నటించడం ఏంటి అని కామెంట్ చేసిన వారందరి నోళ్ళు మూయించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమా రాబోతోంది. కాకపొతే ఇందులో రజినీ నటించడం లేదు. దర్శక నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

12. నాగవల్లి

‘నాగవల్లి’ అనే హర్రర్ మూవీలో విక్టరీ వెంకటేశ్ నటించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ రెండు పాత్రల్లో కనిపించారు. ఒకరు సైక్రియాటిస్ట్ గా, విలన్ నాగభైరవగా ఆకట్టుకున్నాడు. ఇందులో అనుష్క, కమలినీ ముఖర్జీ, శ్రద్ధా దాస్, రిచా గంగపాధ్యాయ్ ఇతర పాత్రలు పోషించారు. ఇది ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే 2010 చివర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

13. రాజుగారి గది- 2

కింగ్ నాగార్జున ‘రాజు గారి గది 2’ అనే హర్రర్ కామెడీ చిత్రంలో నటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత రూత్ ప్రభు, సీరత్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఇది ‘రాజు గారి గది’ సినిమాకు సీక్వెల్. ప్రేతమ్ అనే మలయాళ చిత్రం ఆధారంగా రూపొందింది. ఇందులో ఆత్మల ఉనికిని కనుగొనే మెంటలిస్ట్ రుద్రగా నాగ్ కనిపించారు.

14. రాక్షసుడు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కిన హార్రర్ కామెడీ మూవీ ‘మాస్’. ఇది తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రిలీజ్ అయింది. ఇందులో సూర్య ఫాదర్ అండ్ సన్ గా రెండు పాత్రల్లో నటించాడు. నయనతార, ప్రణీత హీరోయిన్స్ గా నటించారు. 2015లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

15. ప్రేమకథా చిత్రమ్ – 2

premakatha-chitram-2-release-date-fixed

2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి సీక్వెల్‌ గా ప్రేమకథా చిత్రమ్- 2 ఏప్రిల్ 6 2019, విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ సినిమా. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో హరి కిషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత జంటగా నటించారు. ఈ సినిమా అభిమానులను అలరించలేకపోయింది.

16. ‘నిను వీడని నీడను నేనే’

4ninu-veedani-needanu-nene

యువ హీరో సందీప్ కిషన్ 2019లో హారర్ ను టచ్ చేస్తూ, ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమా చేశాడు. ఇప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’ అనే చిత్రంతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ లో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

17. గీతాంజలి

10geethanjali-movie

2004లో చిత్రం రాజ్ కిరణ్ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా హర్రర్ కామెడీ గీతాంజలి. ఇందులో అంజలి ..గీతాంజలి మరియు ఉషాంజలిగా ద్విపాత్రాభినయం చేసింది, ఈ చిత్రంలో ఇద్దరూ సోదరీమణులు. సత్యం రాజేష్, షకలక శంకర్, రావు రమేష్ మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శ్రీనివాస రెడ్డి హీరోగా పరిచయం అయ్యాడు. ‘గీతాంజలి’ తన మేనేజింగ్ డైరెక్టర్ చేత అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న కథను చెబుతుంది, అయితే మేనేజర్ నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె సోదరీమణుల శరీరంలో దెయ్యం వలె తిరిగి వస్తుంది. అయితే, ఇంటర్వెల్ తర్వాత, చిత్రం యు-టర్న్ తీసుకుంటుంది, ఇది కామెడీ-హర్రర్ చిత్రంగా మారుతుంది.

18. ఎక్కడికి పోతావు చిన్నవాడా

nikhil, Ekkadiki Pothavu Chinnavada Movie, Actress Hebah Patel, Actress Avika Gor, director vi anand,

నిఖిల్ సిద్ధార్థ దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అతని కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌లో ఒకటి. ఒక స్త్రీ తన వివాహానికి ముందే పారిపోయింది, అయితే, ప్రమాదంలో పడి చనిపోయింది. అయినప్పటికీ, ఆమె తన శాశ్వతమైన ప్రేమను కలుసుకోవడానికి ఆమె ఆత్మ మరొక శరీరం కోసం వెతుకుతుంది. దర్శకుడు విఐ ఆనంద్ స్థిరపడిన క్లాసిక్ జానర్ నుండి బయటపడ్డాడు. ఈ చిత్రం అద్భుతమైన స్క్రీన్‌ప్లే మరియు అద్భుతమైన ప్రదర్శనలను కలిగి ఉంది. దెయ్యం ప్రేమికుడిని సంబోధించేటప్పుడు చాలా పెద్ద నవ్వులతో, సినిమా హాస్యం చాలావరకు హాస్య అభిమానులకు నేరుగా తెలుసుకోవాలనే లక్ష్యంతో ఉంటుంది.

19. కాంచన

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ‘ముని’కి ‘కాంచన’, ‘కాంచన 2’ అఫీషియల్ సీక్వెల్స్. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా వసూళ్లు రాబట్టిన ‘ముని’ మినహా ఈ రెండు సీక్వెల్స్ సూపర్ హిట్ అయ్యాయి. రాఘవ లారెన్స్ ప్రతిభావంతుడైన డాన్స్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, నిష్ణాతుడైన దర్శకుడు కూడా. అతను 2004లో అక్కినేని నాగార్జున నటించిన ‘మాస్’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. లారెన్స్ కాన్సెప్ట్ దెయ్యాల వల్ల భయపడి, దెయ్యం పట్టి విచిత్రంగా ప్రవర్తించే యువకుడి గురించి. భయపడిన యువకుడి శరీరంలోకి ప్రవేశించిన దెయ్యం పగ తీర్చుకోవడమే సినిమా. భయానక క్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో చాలా నవ్వు రేకెత్తించే క్షణాలు కూడా ఉన్నాయి.

20. విరూపాక్ష

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ కు అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఉత్కంఠతకు గురిచేసే అంశాలు నిండిన థ్రిల్లర్ చిత్రమిది. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఓవర్ సీస్ లో 1 మిలియన్ డాలర్స్ తో కలిపి 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Intlo
  • #Avunu
  • #Chandramukhi
  • #Jaganmohini
  • #Kaashmora

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

12 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

12 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

12 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

15 hours ago

latest news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

19 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

19 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

19 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

21 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version