2016 లో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న రకుల్
- December 14, 2016 / 09:29 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి 2016 హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. 2015 లో ఆమె నటించిన పండగ చేస్కో విజయం సాధించగా, కిక్ 2 , బ్రూస్లీ నిరాశపరిచాయి. 2009 లో కన్నడ చిత్రం ద్వారా వెండి తెర మీద కనిపించిన ఈ సుందరి లైమ్ లైట్ లోకి రావడానికి చాలా కష్టపడింది. 2013 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో హీరోల చూపుని తనవైపు తిప్పుకుంది. అవకాశాలను పట్టింది. 2014 లో రఫ్, లౌక్యం, కరెంట్ తీగ సినిమాలతో పాటు ఇతర భాషల్లో మరో రెండు చిత్రాలను చేసింది. అయినా ఏది బ్లాక్ బస్టర్ కాలేదు. ఇలా గత ఐదేళ్లుగా ఫామ్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న రకుల్ కి ఈ సంవత్సరం మంచి కానుకను ఇచ్చింది.
ఈ ఏడాది ఆమె నటించిన తెలుగు చిత్రాలు నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ భామ కెరీర్ లో 2016 అమూల్యమైన సంవత్సరం గా మిగిలింది. అంతేకాదు వచ్చే ఏడాది టాలీవుడ్ టాప్ హీరోయిన్ కానుంది. ఎందుకంటే ప్రస్తుతం రకుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ మూవీలోనూ అథ్లెట్ గా కనిపించనుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ ఛైతన్యతో కలిసి పని చేస్తోంది. ఈ మూడు చిత్రాలకు ఈ సంవత్సరంలోనే సంతకం చేయడంతో హిట్ గ్యారంటీ అని రకుల్ నమ్ముతోంది. అనుకున్నట్లు జరిగితే 2017 లో టాలీవుడ్ నంబర్ వన్ కిరీటం ఆమెదే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














