2022లో హిట్టైన సినిమాలు ఇంత తక్కువా?

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల పెద్ద సినిమాలలో చాలా సినిమాల షూటింగ్ లు వాయిదా పడటంతో పాటు సినిమాలు సైతం థియేటర్లలో ఆలస్యంగా విడుదలయ్యాయి. అయితే గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది విడుదలైన సినిమాలలో హిట్టైన సినిమాలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో విడుదలైన సినిమాలలో బంగార్రాజు సినిమా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపుగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి నాగార్జున, నాగచైతన్య కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ హిట్ గా నిలిచింది.

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన సినిమాలలో డీజే టిల్లు, భీమ్లా నాయక్ సినిమాలు సక్సెస్ సాధించాయి. టికెట్ రేట్లు పెంచి ఉంటే భీమ్లా నాయక్ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మార్చి నెలలో విడుదలైన ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

ఈ సినిమా సక్సెస్ ఎన్టీఆర్, చరణ్ రేంజ్ ను పెంచింది. ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలలో కేజీఎఫ్ ఛాప్టర్2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మే నెలలో విడుదలైన సినిమాలలో సర్కారు వారి పాట, డాన్, ఎఫ్3 సినిమాలు హిట్లుగా నిలిచాయి. అయితే ఈ సినిమాలలో సర్కారు వారి పాట, ఎఫ్3 అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు.

జూన్ నెలలో విడుదలైన సినిమాలలో మేజర్, విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే విడుదలైన సినిమాలతో పోల్చి చూస్తే సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువ కావడం గమనార్హం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus