Mahesh Babu: అయినవాళ్లందరినీ ఈ ఏడాదే కోల్పోయిన మహేష్‌!

ఏంటో ఈ సంవత్సరం నాకు అస్సలు కలసి రావడం లేదు అని అంటుంటారు కొంతమంది. అయితే వాళ్ల కష్టాలు మనకు తెలియవు కానీ.. మన కళ్ల ముందే రోజూ కనిపించే ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబుకి మాత్రం ఈ సంవత్సరం అస్సలు కలసి రావడం లేదని పక్కాగా చెప్పొచ్చు. కుటుంబాన్ని మించింది ఇంకొకటి లేదు అని మహేష్‌ బాబు అంటూ ఉంటాడు. అలాంటి కుటుంబంలో కీలకమైన ముగ్గురినీ ఈ ఏడాదే కోల్పోయాడు అంటే మహేష్‌ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ నటుడు, మహేష్‌ తండ్రి అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం వేకువజామున కన్నుమూశారు. అనారోగ్యంతో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో మహేష్‌ జీవితంలో 2022 ఓ పీడకలగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఎందుంటే ఈ ఏడాదే మహేష్‌ తన తల్లిని, అన్నయ్యను కూడా కోల్పోయాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులు రాసుకుంటూ.. మహేష్‌కు గుండె ధైర్యం ప్రసాదించు దేవుడా అని వేడుకుంటున్నారు.

ఈ ఏడాది జనవరి 8న మహేష్‌బాబ అన్నయ్య.. నటుడు, నిర్మాత రమేశ్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్రంగా పోరాడి చనిపోయారు. దీంతో అప్పుడు మహేష్‌ బాగా డీలా పడిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం అంటే సెప్టెంబరు 28న మహేష్‌ మాతృమూర్తి ఇందిరా దేవీ కన్నుమూశారు. ఆ సమయంలో మహేష్‌ను ఓదార్చడం కూడా సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కష్టమైపోయింది.

ఇప్పుడు తండ్రిని కోల్పోయాడు మహేష్‌. ఒక మనిషికి ఒకే ఏడాది మూడు షాక్‌లు తగిలితే తట్టుకోవడం కష్టం. కానీ మహేష్‌కు అలాంటి బాధను తట్టుకునే శక్తిని ఆ దేవుడు కచ్చితంగా ప్రసాదించాల్సిందే. చిన్నతనం నుండి అన్నయ్యను, తల్లిని, తండ్రిని చూస్తూ, ఆరాదిస్తూ పెరిగిన మహేష్‌కు ఒకే ఏడాది ముగ్గురూ దూరం కావడం నిజంగా కష్టమైన విషయమే. ఈ బాధను దిగమింగడానికి అవసరమైన మనో బలం మహేష్‌కు ప్రసాదించు దేవుడా!

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus