2023 సంవత్సరంలో బాక్సాఫీస్ విజేతలుగా నిలిచిన ఇద్దరు హీరోలు వీళ్లే!

2023 సంవత్సరంలో 100కు పైగా తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలలో సక్సెస్ సాధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాలను అందించిన సినిమాలు ఎన్ని అనే ప్రశ్నకు 12 నుంచి 15 సినిమాలు మాత్రమేననే సమాధానం వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది విజేతలు ఎవరనే ప్రశ్నకు బాలయ్య, నాని పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఈ ఏడాది వేర్వేరుగా రెండు సినిమాలను థియేటర్లలో విడుదల చేసి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.

బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి మంచి లాభాలను సొంతం చేసుకున్నాయి. నాని దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2023 సంవత్సరంలో బాక్సాఫీస్ విజేతలుగా నిలిచిన ఇద్దరు హీరోలు వీళ్లే కావడం గమనార్హం.

మిగతా హీరోలలో చాలామంది హీరోలు ఒక సినిమాతో సక్సెస్ సాధించినా మరో సినిమాతో నిరాశపరిచారు. ఈ ఏడాది యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయలేదు. స్టార్ హీరోలలో ఎక్కువమంది పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. పెద్ద సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో ఆయా సినిమాల షూటింగ్ ఆలస్యమవుతోంది.

స్టార్ హీరోల సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాదించి మంచి లాభాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2024 సంవత్సరంలో రిలీజ్ కానున్న అన్ని పెద్ద సినిమాల బడ్జెట్ దాదాపుగా 5000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడమే బాలయ్య, నాని (Nani) సక్సెస్ సీక్రెట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus