వచ్చే ఏడాది వేసవిలో వచ్చే వినోదాలు ఇవే!

సమ్మర్‌ అంటే చాలా హాట్‌గా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే. సినిమా ప్రేక్షకులకు అయితే ఆ హాట్‌లో స్వీట్‌, నాటు, క్యూట్‌ సినిమాల సందడి ఉంటుంది. సెలవుల సీజన్‌ కావడంతో మన నిర్మాతలు కూడా రెండున్నర నెలల సమయంలో వరుస సినిమాలు రిలీజ్‌ చేస్తూ ఉంటారు. అలా వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలు సమ్మర్‌ ఆటకు రెడీ అయిపోయాయి. వీటిలో కొన్నింటికి అధికారికంగా డేట్స్‌ ప్రకటించగా మరికొన్నింటి డేట్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేయండి మరి.

* 2023 సమ్మర్‌ స్టార్ట్‌ అయ్యేది నాని సినిమాతో అంటున్నారు. నాని – కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న ‘దసరా’ సినిమాను సమ్మర్‌ కానుకగా తీసుకొస్తామని టీమ్‌ ఇప్పటికే చెప్పేసింది. నాని లుక్‌తోనే సినిమా మీద అంచనాలు వచ్చాయి. శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 30న వస్తుంది.

* రవితేజ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాశ్‌, దక్ష నగార్కర్‌, అను ఇమ్మాన్యుయేల్‌, పూజితా పొన్నాడ అంటూ ఐదుగురు హీరోయిన్లు. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేస్తారట.

* చిరంజీవి – కీర్తి సురేశ్‌ – తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. తమిళ హిట్‌ ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

* లారెన్స్‌ – కతిరేసన్‌ కాంబినేషన్‌ రూపొందుతున్న చిత్రం ‘రుద్రుడు’. ఏప్రిల్ 14, 2023న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తారని సమాచారం. ‘కాంచన 3’ విడుదలైన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న చిత్రమిది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.

* రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జైలర్‌’. శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, వసంత్‌ రవి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం.

* తమిళ సినిమా నుండి ఇటీవల వచ్చిన అద్భుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. మణిరత్నం తెరకెక్కించిన ఈ అద్భుతానికి సీక్వెల్‌ రెడీ అయిపోయిందనే విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్‌ 28న విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఫిబ్రవరి నుండి ప్రచారం మొదలవుతుందని టాక్‌.

* పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో వస్తుందని తొలుత చెప్పారు. అయితే ఇప్పుడది మే నెలకు షిఫ్ట్‌ అయ్యింది అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

* ఇక మిగిలిన మరో సినిమా మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ మూవీ. ఈ సినిమా కూడా ఏప్రిల్‌ ఆఖరున రిలీజ్‌ అవుతుందని చెప్పారు. అయితే మహేష్‌ ఇంట విషాదం.. ప్రాజెక్ట్‌లో అసంతృప్తుల వల్ల షూట్‌ ఆలస్యమవుతుంది. దీంతో సినిమాను మే నెలకు తీసుకెళ్తారని టాక్‌.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus