సినిమా వాళ్ళను ప్రేక్షకులు చాలా పర్సనల్ గా ఫీలవుతుంటారు. సోషల్ మీడియా వచ్చాక వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అయిపోతుండటం.. మనం చూస్తూనే ఉన్నాం. మీ సినిమా బాగుంది, మీ నటన బాగుంది వంటి ఇంటరాక్షన్ లో అయితే ఎటువంటి తప్పులేదు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో దూరేసి ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తే… అక్కడొస్తుంది అసలైన సమస్య. ఇలా జరిగితే కొంతమంది సెలబ్రిటీలు లైట్ తీసుకుంటారు. మరికొంతమంది అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు.
సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది. 21 సంవత్సరాల (Actress) నటి 53 ఏళ్ళ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో డబ్బు కోసం ఇంత దిగజారాల అంటూ..విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. స్నేహల్ రాయ్ అనే నటి మద్వేంద్ర కుమార్ అనే రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. ఇక ట్రోలింగ్ పై ఆమె స్పందిస్తూ..10 ఏళ్ళ క్రితమే మా వివాహం జరిగింది. పెద్ద వయసు కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు.
జనాలెందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. మా మధ్య ఎప్పుడూ అలాంటి విషయాల పై గొడవ రాదు. మేము మా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నాం. మాకు లేని బాధ మీకు ఎందుకు. వ్యక్తిగత విషయాల పై ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం సబబు కాదు… అంటూ స్నేహల్ చెప్పుకొచ్చింది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!