‘అ’ లో రెజీనా లుక్ వెనుక 24 గంటల శ్రమ

నేచురల్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మించిన ‘అ!’ అనే మూవీలో పాత్రలు అన్ని విభిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా రెజీనా లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ లుక్ వెనుక 24 గంటల కష్టం దాగుంది. “అ”’ సినిమాలోని బ్యాక్‌లుక్‌ గురించి రెజీనా తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించింది. “డిఫెరెంట్ హెయిర్‌ స్టైల్‌, చేతుల మీద గ్యాప్‌ లేనంతగా టాటూలు వేయించుకుని సినిమాలో నటించాలని ముందే నాకు చెప్పారు. క్యారక్టర్ డిఫెరెంట్ గా ఉండడంతో ఒప్పుకున్నా. దాంతో షూటింగ్‌ ముందురోజే నేను హైదరాబాద్‌కి చేరుకున్నా. ఆ హెయిర్‌ స్టైల్‌ పూర్తి చేసి, వెనుక వైపు జుట్టు కట్‌ చేసి, డైమండ్‌ షేప్‌లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుని, ఆ తర్వాత చేతి వేళ్ల వరకు టాటూలు డిజైన్‌ చేయడానికి సరిగ్గా 24 గంటలు పట్టింది.

సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన హెయిర్‌స్టైల్‌, టాటూ ప్రక్రియ మరుసటి రోజు అదే సమయానికి పూర్తయింది. అందులోనూ అప్పటికి వీపుమీద చెట్టు వేయనేలేదు. దానికి ఇంకా సమయం పట్టింది. ఆ లుక్‌తో మొదటి షెడ్యూల్‌లో నాలుగు రోజులు షూట్‌ చేశాను. అలా మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఆ షూటింగ్‌ జరిగినన్ని రోజులు నేను స్నానం చేయలేదు. కేవలం స్పాంజ్‌ బాత్‌ చేశానంతే.’’ అని రెజీనా వివరించింది. ఇంత కష్టపడ్డ పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని రెజీనా ధీమాగా ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రెజీనాతో పాటు నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus