అనంతపూర్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య.. ఏమైందంటే?

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు నుంచి మూవీ షూట్ లో శ్రీలీల కూడా పాల్గొననున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఎంపికైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

షైన్ స్కీన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య అనిల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య ఈ సినిమా కోసం కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు బాలయ్యకు పారితోషికంగా దక్కుతుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా ఒక ఏరియా హక్కులను తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలలో అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి. అనిల్ రావిపూడి బాలయ్యను ఈ సినిమాలో కొత్తగా చూపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య శ్రీలీల కాంబో సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.

అనిల్ బాలయ్య కాంబో మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకు బాలయ్యకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విభిన్నమైన కథలకు బాలయ్య ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus