బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ హౌస్ లో సెకండ్ వీక్ నామినేషన్స్ హౌస్ ని హీటెక్కించాయి. 2వ వారం కూడా బిగ్ బాస్ వారియర్స్ ఇంకా ఛాలెంజర్స్ ని వేరు వేరుగా విభజించి ఒకర్ని ఇంకొకరు నామినేషన్స్ చేసే విధంగా ప్రక్రియని పెట్టాడు. ఇందులో భాగంగా ఫస్ట్ వారియర్స్ ఛాలెంజర్స్ ని ఒక్కర్ని నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఫస్ట్ ఒక్కొక్కరిగా వస్తూ నామినేషన్స్ ని చేశారు. యాంకర్ శివ, మిత్రా శర్మ, శ్రీరాపాక, అనిల్ నలుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.
బిందుమాధవి, ఆర్జే చైతూ, స్రవంతి , అజయ్ నలుగురు సేఫ్ లో ఉన్నారు. వీరిని ఎవరూ నామినేట్ చేయలేదు.ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఛాలెంజర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వారియర్స్ లో నుంచీ ఇద్దర్ని నామినేట్ చేయమని అందుకు తగిన కారణాలు చెప్పమని చెప్పాడు. ఇక్కడే అషూరెడ్డికి మిత్రాశర్మకి టఫ్ ఫైట్ అయ్యింది. చాలాసేపు ఒకే ఒకవిషయంలో ఆర్గ్యూమెంట్ చేసుకున్నారు. ముఖ్యంగా మిత్రాశర్మ తనని నామినేట్ చేసిన అషూరెడ్డిని నామినేట్ చేసింది.
నెగిటివిటీ అన్న పదం నాకు నచ్చలేదని, నా దగ్గర అంత నెగిటివిటీ ఉంటే రావద్దని వాదించింది. డల్ గా ఉన్నావ్ అన్నావ్, ఎనర్జీ తగ్గిందన్నా పర్లేదు కానీ, నా దగ్గర నెగిటివిటీ ఉందంటే మాత్రం నేను ఒప్పుకోను అంటూ మిత్రాశర్మ అషూకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇదే విషయంలో చాలాసేపు ఇద్దరూ గొడవ పడ్డారు.నా ఉద్దేశ్యం అది కాదని, నువ్వు హౌస్ లో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావ్ అని, ఇప్పుడు కూడా అదే విషయం చెప్తూ ఇలా చేస్తుంటే ఇదే నెగిటివిటీ అంటూ అషూ స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
ఇద్దరికీ చాలాసేపు ఆర్గ్యూమెంట్ జరగడంతో హౌస్ మేట్స్ అందరూ అసహనానికి గురి అయ్యారు. ఆ తర్వాత యాంకర్ శివకి అఖిల్ కి, నటరాజ్ మాస్టర్ కి గట్టిగానే పడింది. నటరాజ్ మాస్టర్ ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటే తర్వాత మాట్లాడుకోండి అని కెప్టెన్ తేజస్వి చెప్పింది. మొత్తానికి ఏడుగురు సీనియర్స్ నలుగురు జూనియర్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. నటరాజ్ మాస్టర్, అషూరెడ్డి, అరియానా, అఖిల్, సరయు, హమీదా, మహేష్ విట్టా, మిత్రాశర్మ,అనిల్, శ్రీరాపక, యాంకర్ శివ వీళ్లు నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీళ్లలో ఈసారి హౌస్ నుంచీ ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తికరం.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!