Mahesh Babu, Rajamouli: మహేష్- రాజమౌళి సినిమాలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్

మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుంది. మహేష్ బాబు ఓ బిగ్గెస్ట్ స్టార్ హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి. గతంలో అతని దర్శకత్వంలో సినిమాలో చేసిన హీరోలు బిగ్గెస్ట్ స్టార్లుగా ఎదిగారు. ‘స్టార్లతో సినిమా చేయడమనేది పెద్ద ఛాలెంజ్.. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు.. నా కంఫర్ట్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదు’ అంటూ రాజమౌళి గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు రాజమౌళి స్థాయి పెరిగింది. రాజమౌళి ఏం చేసినా కరెక్ట్ అనుకునేలా టాలీవుడ్ ప్రిపేర్ అయ్యింది. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా రాజమౌళి ఏం చెప్పినా కరెక్ట్ అని భావిస్తున్నారు.ఆస్కార్ తెప్పించిన ఘనత రాజమౌళికి సొంతమైంది కాబట్టి.. ఏ స్టార్ హీరో అయినా రాజమౌళి మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి.. మహేష్ తో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు.

మహేష్ (Mahesh Babu) కంప్లీట్ గా సరెండర్ అవుతాడు. ఈ ప్రాజెక్టులో మహేష్ తో పాటు మరో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ నటించబోతున్నారు అని వినికిడి. వాళ్ళు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా ఇంటర్నేషనల్ మర్కెట్స్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటుంది. అందుకే బాలీవుడ్ నుండి ముగ్గురు స్టార్స్ ను తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ సినిమాకు రూ. 1500 కోట్ల బడ్జెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Sri Simha Koduri,  Nandini Rai Exclusive Interview | Bhaag Saale Movie | Filmy Focus Originals

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus