పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోగా తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. దాదాపు 80 శాతం షూటింగ్ ఆయన డైరెక్షన్లో కంప్లీట్ అయ్యింది. కానీ చివర్లో కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. అందువల్ల నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. అలా ‘హరిహర వీరమల్లు’ ని ఇద్దరు దర్శకులు కంప్లీట్ చేశారు అని అంతా అనుకున్నారు.
కానీ దీనికి మరో దర్శకుడు కూడా పనిచేశాడట. అతను మరెవరో కాదు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు. జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ” ‘హరిహర వీరమల్లు’ టైటిల్ పెట్టింది దర్శకులు క్రిష్ గారు. ఆయనకు చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. అతను చాలా పవర్ఫుల్ కింగ్. ఇండియా మొత్తం రూల్ చేశాడు.
ఇండియా అంటే అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి శ్రీలంక దాకా.. అంత పెద్ద పవర్ఫుల్ రూలర్ అని చెప్పాలి. అంత పెద్ద రూలర్ కి ఒక వ్యక్తిని తలుచుకుంటే నిద్ర పట్టేది కాదు. అది ఎవరో కాదు ఛత్రపతి శివాజీ. అతను బ్రతికున్నన్ని రోజులు ఔరంగజేబు నిద్రపోయేవాడు కాదు. ఎటువైపు నుండి అతను వచ్చి అటాక్ చేస్తాడో అనే భయంతో ఉండేవాడు.అతను అనారోగ్యం పాలై 1680 లో చనిపోయారు. ఈ కథ 1684 నుండి స్టార్ట్ అవుతుంది.
ఛత్రపతి శివాజీ చివరి కోరిక ఏంటంటే.. మొఘల్స్ నుండి జ్యోతి లింగాలను కాపాడాలి. అలాగే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ను కాపాడాలని. అతని చివరి కోరిక ‘హరిహర వీరమల్లు’ ద్వారా ఎలా నెరవేరింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో 18 నిమిషాల ఫైట్ ను పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు.