ఈ మధ్య కాలంలో చాలా మంది సినిమా వాళ్ళు మృతి చెందారు. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను, దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి,హుమైరా అస్గర్ అలీ, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ వంటి వారు కన్నుమూశారు.ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అచ్యుత్ పోత్దార్ కన్నుమూశారు.ఈయన వయసు 91 ఏళ్ళు. కొన్నాళ్ళుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఈయన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి.పరిస్థితి విషమించడంతో ఇటీవల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఓ దశలో కోలుకుంటున్నట్లు కనిపించినా మళ్ళీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
ఆగస్టు 18న సోమవారం నాడు థానేలోని జూపిటర్ హాస్పిటల్లో ఆయన మృతి చెందడం జరిగింది. ఈ వార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆయన అంత్యక్రియలు ఈరోజు అనగా ఆగస్టు 19న నిర్వహించనున్నారు. 40 ఏళ్లుగా అచ్యుత్ పోత్దార్ సినీ పరిశ్రమలో ఉన్నారు. మరాఠీ మరియు హిందీ సినిమాలతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘3 ఇడియట్స్’ లో చేసిన ప్రొఫెసర్ పాత్ర ఈయన్ని యూత్ కి చేరువయ్యేలా చేసింది. అలాగే ‘రంగీలా’ ‘లగేరహో మున్నాభాయ్’ ‘దబాంగ్ 2’ వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.