Pawan Kalyan: 3 పెళ్లిళ్లు..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ సీరియస్..!
- October 22, 2022 / 01:29 PM ISTByFilmy Focus
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ నోటీసులు జారీచేసింది. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఈ నోటీసులు పంపారు. వివరాల్లోకి వెళ్తే.. పవన్ ఈమధ్య రాజకీయాలకు సంబంధించి తన ప్రసంగంలో ’ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు’ అంటూ చేసిన కామెంట్స్ పై దుమారం చెలరేగింది.. పవన్ మాటలపై ఆంధ్ర రాష్ట్ర మహిళా కమీషన్ మండిపడింది.. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ ఆయనకు నోటీసులు పంపింది.
భరణం ఇస్తే ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని.. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి స్త్రీలను గౌరవించాల్సిందిపోయి, మహిళలను కించపరచడం మంచి పద్ధతి కాదని మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కాగా, ఇటీవల తనను ప్యాకేజ్ స్టార్ అంటున్న వారిపై మండిపడుతూ పవన్ అధికార పార్టీకి చెందిన నాయకులపై ఫైర్ అయ్యాడు. తన కాలికున్న చెప్పు తీసి చూపిస్తూ.. ‘‘చెప్పుతీసుకుని పళ్లు రాలగొడతా కొడకల్లారా ఒకొక్కడికి చెప్తున్నా.. ఒరేయ్ వెధవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా’’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు పవన్.

పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్దదుమారమే రేపాయి. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కామెంట్స్ ని తప్పుబట్టారు. కొద్ది రోజులుగా పవన్ వార్నింగ్ ఇస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీంతో పవన్ ని టార్గెట్ చెయ్యాలనేది అధికార పార్టీ ఆలోచన అని..

ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ పవన్ సినిమాల మీద పడుతుందని.. పవర్ స్టార్ నటించిన సినిమాలు ఏపీలో విడుదల కాకుండా అడ్డుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. ‘‘మీరు ఏం చేస్తారో చెయ్యండి.. మా హీరో సినిమాలు ఎలా ఆపుతారో ఆపండి.. మేమూ చూస్తాం.. దేనికైనా రెడీ.. మా సహనాన్ని పరీక్షించొద్దు’‘ అంటూ అధికార పార్టీపై ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..
జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

















