ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలను ఎక్కువ రోజులు దాచి.. వాటికి ఇంట్రెస్ట్ లు చెల్లించడం కంటే..మంచి ఆఫర్ వస్తే ఓటిటిల్లో విడుదల చెయ్యడమే కరెక్ట్ అని డిసైడ్ అయిపోయారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ‘వి’ తో దిల్ రాజు ముందడుగు వెయ్యగా..ఇప్పుడు మిగిలిన వారు కూడా క్యూలు కడుతున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని ‘ఆహా’ లో విడుదల చేస్తున్నట్టు ఆ చిత్రం దర్శకనిర్మాతలు ప్రకటించేశారు.
రేపో మాపో .. ‘నిశ్శబ్దం’ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘రెడ్’ ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖీ’ వంటి చిత్రాలు కూడా ఓటిటిలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. నాగచైతన్య – సాయి పల్లవి- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా కూడా ఓటిటిలోనే విడుదలవుతుందంటూ ప్రచారం మొదలైంది. వివరాల్లోకి వెళితే.. ‘లవ్ స్టోరీ’ చిత్రానికి ఓ ప్రముఖ ఓటిటి సంస్థ నుండీ భారీ ఆఫర్ వచ్చిందట. వాళ్ళు 30కోట్ల వరకూ ఆఫర్ చేశారట. అయితే ఈ చిత్రం నిర్మాతలైన ‘ఏషియన్’ వారికి ఇదే మొదటి సినిమా.
పైగా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కూడా..! వాళ్ళు కనుక ఓటిటికి సినిమాని అమ్మేస్తే.. డిస్ట్రిబ్యూటర్లు గొడవ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తో చాలా వరకూ థియేట్రీకల్ బిజినెస్ ఎప్పుడో పూర్తయిపోయింది. ఈ క్రమంలో కనుక సినిమాని ఓటిటికి ఇచ్చేస్తే ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి ‘లవ్ స్టోరీ’ ఓటిటిలో విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!