ఇటీవల ‘లైలా'(Laila) ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) మాట్లాడిన మాటలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్లో పృథ్వీ ‘ ‘లైలా’ లో దర్శకుడు రామ్ నారాయణ్ గారు నాకు ‘మేకల సత్తి’ అనే పాత్ర ఇచ్చారు. అభిమన్యు సింగ్ కి ఆపోజిట్ గా ఆ పాత్ర ఉంటుంది. సినిమాలో ఒక సీన్లో ‘మేకల సత్తిని పట్టుకురండిరా’ అని అభిమన్యు సింగ్ నాకు ధమ్కీ ఇస్తాడు. ఆ టైంలో నా దగ్గర 150 మేకలు ఉంటాయి.
సినిమా క్లైమాక్స్ లో విలన్ గ్యాంగ్ నన్ను వదిలేసినప్పుడు నేను అడిగితే 11 మేకలే ఉన్నాయి అంటారు. ఇలా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చారు. ఇవి వైసీపీ శ్రేణులకి కోపం తెప్పించాయి. దీంతో వాళ్ళు ‘బాయ్ కాట్ లైలా’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఇందుకు భయపడి హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), నిర్మాత సాహు (Sahu Garapati) వెంటనే స్పందించి వాళ్ళకి క్షమాపణలు చెప్పారు.
‘పృథ్వీ కామెంట్స్ తో మాకు సంబంధం లేదు, ఆయన చెప్పిన సీన్లు సినిమాలో ఉండవు’ అంటూ తోసిపుచ్చారు. ఇంతలో ఆయన హాస్పిటల్ పాలవడం చర్చనీయాంశం అయ్యింది వివరాల్లోకి వెళితే.. పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీ హాస్పిటల్ పాలయ్యారు. అందుకు కారణం ఈయనకు హై బీపీ రావడమే అని తెలుస్తుంది.
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం. పృథ్వీ హాస్పిటల్లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కొందరు జాలిపడుతుంటే.. వైసీపీ పార్టీ కార్యకర్తలు ‘మంచి వాళ్ళని మేకలు అంటే ఇలాగే ఉంటుంది’ అంటూ నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. ‘లైలా’ సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచిన పృథ్వీ..#PrudhviRaj #Laila #LailaTrailer #VishwakSen pic.twitter.com/xcT3g5HZkj
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 11, 2025