35 Chinna Katha Kaadu Collections: ’35- చిన్న కథ కాదు’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
- September 12, 2024 / 04:30 PM ISTByFilmy Focus
సెప్టెంబర్ మొదటి వారంలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ’35.. చిన్న కథ కాదు’(35 Chinna Katha Kaadu) . మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నివేదా థామస్ (Nivetha Thomas) , ప్రియదర్శి (Priyadarshi), భాగ్యరాజా, గౌతమి (Gauthami) వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కి 2 రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేశారు మేకర్స్.
35 Chinna Katha Kaadu Collections

వాటికి మంచి స్పందన లభించింది. అయితే మొదటి రోజు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటం వల్ల మ్యాట్నీల నుండి పెరిగాయి. కానీ వీకెండ్ ను అనుకున్న స్థాయిలో క్యాష్ చేసుకోలేదు. అలా అని తీసిపారేసే విధంగా కూడా లేవు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.36 cr |
| సీడెడ్ | 0.15 cr |
| ఉత్తరాంధ్ర | 0.28 cr |
| ఏపీ +ఆంధ్ర (టోటల్ ) | 0.79 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.13 cr |
| ఓవర్సీస్ | 0.22 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 1.14 cr |
’35 – చిన్న కథ కాదు’ రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 6 రోజుల్లో ఈ చిత్రం రూ.1.14 కోట్లు షేర్ ను ( ప్రీమియర్స్ తో కలుపుకుని) రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.0.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.













