హిట్ సినిమాని (Movies) రీమేక్ చేయడం ఎంత కామనో… హిట్టు సినిమా టైటిల్ వాడటం కూడా అంతే కామన్ అనుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాకి టైటిల్ పెట్టడం చాలా కష్టమైపోయింది. నామమాత్రంగా ఒక టైటిల్ పెట్టేస్తే సరిపోదు. కథ, కథనం వంటి అన్ని అంశాలకి తగ్గ టైటిల్ సినిమాకి పెట్టాలి. లేదు అంటే అది జనాల్లోకి వెళ్ళదు. అందుకే మన మేకర్స్ అవసరమైతే పాత టైటిల్స్ ను కూడా పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అలా పాత సినిమాల టైటిల్స్ వాడుకున్న కొన్ని సినిమాలు (Movies), వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :
1) ఖుషి :
2001లో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. దాదాపు 22 ఏళ్ళ తర్వాత అదే టైటిల్ ను తన సినిమాకి పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.2023 లో వచ్చిన ‘ఖుషి’ లో సమంత హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా మాత్రం పవన్ ‘ఖుషి’ స్థాయిలో విజయం సాధించలేదు.
2) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి :
పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ టైటిల్ ఇదే. 1996 లో వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకుంది. 28 ఏళ్ళ తర్వాత ఇదే టైటిల్ ను ప్రదీప్ సినిమా కోసం వాడారు. అతను హీరోగా కూడా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా రూపొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.
3) ఇష్క్ :
నితిన్ ‘ఇష్క్’ సూపర్ హిట్ మూవీ.. తేజ సజ్జ ‘ఇష్క్’ ప్లాప్ సినిమా
4) దేవుడు చేసిన మనుషులు:
ఎన్టీఆర్, కృష్ణ… చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ హిట్ సినిమా… రవితేజ, పూరి చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ ప్లాప్ సినిమా.
5) రుద్రవీణ :
చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ మంచి సందేశాత్మక సినిమా అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద అది డిజాస్టర్ అయ్యింది. కొన్నాళ్ల తర్వాత ఇదే టైటిల్ ను వేరే సినిమా కోసం వాడారు. అది వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.
6) అశ్వద్ధామ :
కృష్ణ, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద సో సో గా ఆడింది. చాలా ఏళ్ళ తర్వాత ఇదే టైటిల్ ను నాగ శౌర్య సినిమా కోసం వాడారు. ఇది కూడా సో సోగానే ఆడింది.
7) రాక్షసుడు – రాక్షసుడు :
ఈ టైటిల్ తో చిరంజీవి హీరోగా ఓ సినిమా వచ్చింది. అది ఆడలేదు. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘రాట్ససన్’ కి రీమేక్ గా వచ్చిన సినిమాకి కూడా ‘రాక్షసుడు’ టైటిల్ వాడారు. ఇది మంచి విజయాన్ని అందుకుంది.
8) గ్యాంగ్ లీడర్ – గ్యాంగ్ లీడర్ :
చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ప్లాప్ అయ్యింది.
9) ముగ్గురు మొనగాళ్లు :
చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ ప్లాప్ అయ్యింది. తర్వాత ఇదే టైటిల్ తో మరో సినిమా కూడా వచ్చింది.
10) విజేత – విజేత :
చిరంజీవి ‘విజేత’ హిట్ సినిమా.. తర్వాత అతని చిన్నల్లుడు నటించిన ‘విజేత’ ప్లాప్ అయ్యింది.
11) అడవి రాముడు :
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అడవి రాముడు’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘అడవి రాముడు’ యావరేజ్ గా ఆడింది.
12) మల్లీశ్వరి :
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘మల్లీశ్వరి’ సూపర్ హిట్ సినిమా. తర్వాత అదే టైటిల్ తో వచ్చిన వెంకటేష్ ‘మల్లీశ్వరి’ కూడా సూపర్ హిట్ అయ్యింది.
13) తొలిప్రేమ :
1998 లో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ ఆల్ టైం సూపర్ హిట్ అయ్యింది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత వరుణ్ తేజ్ సినిమా కోసం ఈ టైటిల్ ను వాడారు. 2018లో వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
14) తమ్ముడు :
1999 లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక పవన్ భక్తుడు అయినటువంటి నితిన్ కూడా ‘తమ్ముడు’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
15) దేవదాసు :
అక్కినేని హీరోగా 1953 లో వచ్చిన ‘దేవదాసు’ ఆల్ టైం హిట్ గా నిలిచింది.2006 లో రామ్ డెబ్యూ మూవీగా రూపొందిన సినిమాకి కూడా ‘దేవదాసు’ అనే టైటిల్ ను పెట్టారు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
16) ఆ ఒక్కటీ అడక్కు :
రాజేంద్రప్రసాద్ – ఈవీవీ కాంబినేషన్లో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సూపర్ హిట్ సినిమా. అదే టైటిల్ ను తన సినిమా కోసం వాడుకున్నాడు ఈవీవీ తనయుడు అల్లరి నరేష్. 2024 లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
17) గీతాంజలి :
మణిరత్నం – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘గీతాంజలి’ క్లాసిక్ మూవీ. కానీ తర్వాత అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన ‘గీతాంజలి’ కూడా బాగానే ఆడింది. కానీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ డిజాస్టర్ అయ్యింది.
18) మజ్ను :
నాగార్జున ‘మజ్ను’ మూవీ సూపర్ హిట్ సినిమా. తర్వాత నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ కూడా బాగానే ఆడింది.
19) స్వాతిముత్యం :
కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’ సూపర్ హిట్ అయ్యింది. కానీ బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వచ్చిన ‘స్వాతిముత్యం’ డిజాస్టర్ అయ్యింది.
20) పుష్పక విమానం :
కమల్ హాసన్ ‘పుష్పకవిమానము’ ,ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ రెండూ ఆడలేదు.
21) మిస్సమ్మ :
1955 లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రి గారి కాంబినేషన్లో ‘మిస్సమ్మ’ అనే సినిమా వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకుంది.2003 లో నీలకంఠ దర్శకత్వంలో భూమిక,లయ, శివాజీ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమాకి ‘మిస్సమ్మ’ అనే టైటిల్ ను వాడారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
22) ఇద్దరు మిత్రులు :
1961 లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే దాదాపు 38 ఏళ్ళ తర్వాత అంటే 1999 లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాకి కూడా ‘ఇద్దరు మిత్రులు’ అనే టైటిల్ ను వాడుకున్నారు. ఇది ఫ్లాప్ అయ్యింది.
23) మాయాబజార్ :
1957 లో వచ్చిన ‘మాయాబజార్’ ఓ కల్ట్ క్లాసిక్ మూవీ. దాదాపు 50 ఏళ్ళ తర్వాత అంటే 2006 లో రాజా హీరోగా ‘మాయాబజార్’ సినిమా వచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిరాశపరిచింది. చాలా మందికి ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా తెలీదు అనే చెప్పాలి.
24) శంకరాభరణం :
1980 లో కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ ఓ సూపర్ హిట్ మూవీ. ఇది క్లాసిక్ సినిమా కూడా. అయితే ఇదే టైటిల్ తో 2015 లో నిఖిల్ హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయ్యింది.
25) శ్రీమంతుడు :
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1971 లో ‘శ్రీమంతుడు’ అనే సినిమా వచ్చింది. ఆ టైంలో ఇది సో సోగా ఆడింది. తర్వాత 2015 లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమాకి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ను వాడారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
26) మహర్షి :
1987 లో వంశీ దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమా వచ్చింది. దీనికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అయితే 32 ఏళ్ళ తర్వాత అదే టైటిల్ ను మహేష్ బాబు 25వ సినిమా కోసం వాడారు. ఇది కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది.
27) బృందావనం :
1992 లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా ‘బృందావనం’ అనే సినిమా వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 18 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం కూడా ఆ టైటిల్ ను వాడారు. 2010 లో వచ్చిన ‘బృందావనం’ సూపర్ హిట్ అయ్యింది.
28) మరో చరిత్ర :
కమల్ హాసన్ మరో చరిత్ర క్లాసిక్ మూవీ, వరుణ్ సందేశ్ మరో చరిత్ర డిజాస్టర్ అయ్యింది
29) బందిపోటు :
ఎన్టీఆర్ ‘బందిపోటు’ యావరేజ్, అల్లరి నరేష్ ‘బందిపోటు’ ప్లాప్.
30) ఆరాధన :
ఎన్టీఆర్ ‘ఆరాధన’ యావరేజ్, చిరంజీవి ‘ఆరాధన’ ప్లాప్.
31) ప్రేమ :
ఏఎన్నార్ ‘ప్రేమ’ యావరేజ్ గా ఆడింది… వెంకటేష్ ‘ప్రేమ’ మంచి విజయాన్ని అందుకుంది.
32) అప్పుచేసి పప్పుకూడు :
ఎన్టీఆర్ ‘అప్పుచేసి పప్పుకూడు’ బాగానే ఆడింది. రాజేంద్ర ప్రసాద్ ‘అప్పుచేసి పప్పుకూడు’ ప్లాప్ అయ్యింది.
33) సుందరకాండ :
వెంకటేష్ ‘సుందరకాండ’ సూపర్ హిట్.. నారా రోహిత్ ‘సుందరకాండ’ రిలీజ్ కావాల్సి ఉంది.
34) గణేష్:
వెంకటేష్ ‘గణేష్’ సూపర్ హిట్ అయ్యింది.. రామ్ ‘గణేష్’ ప్లాప్ అయ్యింది.
35)మోసగాళ్ళకు మోసగాడు – మోసగాళ్ళకు మోసగాడు :
కృష్ణ హీరోగా వచ్చిన తెలుగులో వచ్చిన మొదటి ‘కౌబాయ్’ జోనర్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ పెద్దగా ఆడలేదు. తర్వాత సుధీర్ బాబు సినిమా కోసం కూడా ఈ టైటిల్ వాడారు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది.
36) ఆడవాళ్ళు మీకు జోహార్లు – ఆడవాళ్ళు మీకు జోహార్లు :
కృష్ణంరాజు హీరోగా వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఆడలేదు.కొన్నేళ్ల తర్వాత శర్వానంద్ సినిమా కోసం కూడా ఈ టైటిల్ వాడారు. అది కూడా ఆడలేదు.
37) నారీ నారీ నడుమ మురారి – నారీ నారీ నడుమ మురారి :
బాలకృష్ణ ‘నారీ నారీ నడుమ మురారి’ బాగా ఆడింది. చాలా ఏళ్ళ తర్వాత శర్వానంద్ సినిమా కోసం కూడా ఈ టైటిల్ ను వాడుతున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
38) పెళ్ళిసందడి – పెళ్ళిసందడి :
శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళిసందడి’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అతని కొడుకు రోషన్ నటించిన ‘పెళ్ళిసందD’ కూడా బాగా ఆడింది.