Prabhas, Prashanth Neel: పాత కాంబోతో మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తానంటున్న ప్రశాంత్‌!

‘సలార్‌’ సినిమా పోస్టర్‌, కొన్ని లీక్డ్‌ స్టిల్స్‌ చూస్తే… ప్రభాస్‌ ఫుల్‌ రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ‘కేజీఎఫ్‌’ల మొత్తం యాక్షన్ సీన్స్‌, ఎలివేషన్లతో నిండిపోతుందేమో అని అనుకుంటున్నారు అంతా. అయితే అయింది తీ… ప్రభాస్‌ను ఫుల్‌ మాస్ రోల్‌లో చూడొచ్చు అనుకునేవాళ్లూ ఉన్నారు. అయితే సినిమాకు ఇంకాస్త గ్లామర్‌ ఉంటే బాగుండు అనుకునేవాళ్లూ ఉన్నారు. రెండో టైప్‌ వాళ్లకు గుడ్‌ న్యూస్‌. ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య పెరగింది. ఒకరు…కాదు ముగ్గురు నాయికలు ఈ సినిమాలో కనిపిస్తారట.

‘సలార్‌’లో నాయికగా శ్రుతి హాసన్‌ను ఎంచుకొంది టీమ్‌. ‘మా రాజుగారు పక్కన ఒక్క నాయికేనా’ అని అభిమానులు అన్న మాటలు వినిపించాయో ఏమో… వాణీ కపూర్‌ సెకండ్‌ హీరోయిన్‌ అంటూ ఓ పుకారు బయటికొచ్చింది. సినిమాలో కీలకమైన పాత్రలో ఆమె నటిస్తోందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో కీలక సమయంలో ఓ ప్రత్యేక గీతం ఉందట. అందులో కాజల్‌తో డ్యాన్స్‌ చేయించాలని చిత్రబృందం భావిస్తోందట. అదన్నమాట సంగతి. అలా ఈ సినిమాలో ముగ్గురు నాయికలు అవుతున్నారు.

పెళ్లయ్యాక కాజల్‌ పాత్రల విషయంలో పెద్దగా బెట్టు ఏమీ చూపించడం లేదు. ఆ మాటకొస్తే పెళ్లికి ముందు కూడా అంతే. ‘జనతా గ్యారేజ్‌’లో ప్రత్యేక గీతం చేసింది. ఇప్పుడు ఇదే ఫ్లోలో ‘సలార్‌’లో స్పెషల్‌ సాంగ్‌కి ఓకే చెప్పేస్తుందేమో చూడాలి. ఒకవేళ కాజల్‌ వద్దు అంటే టాలీవుడ్‌ ఐటెమ్‌ స్పెషల్ హీరోయిన్‌ తమన్నా ఎలాగూ ఉంది. ఆమెనైనా తీసుకోవచ్చు. గతంలో ప్రభాస్‌, కాజల్‌ స్క్రీన్ మీద కనిపిస్తే… బీభత్సమైన హిట్‌లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే అవుతుందేమో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus