మరోసారి రికార్డ్ టి.ఆర్.పి నమోదు చేసిన మహేష్ సినిమా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సరిలేరు నీకెవ్వరు. 2020 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం థియేటర్ లలో మాత్రమే కాదు బుల్లితెర పై కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడు ఏకంగా రికార్డు స్థాయిలో 23.4 టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసింది.

అటు తరువాత రెండో సారి టెలికాస్ట్ చేసినప్పుడు 17.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసి మరో రికార్డుని క్రియేట్ చేసింది. 3 వ సారి కూడా 12.55 టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసింది. ఇక ఈ మధ్యనే సంక్రాంతి కానుకగా మళ్లీ టెలికాస్ట్ చెయ్యగా ఈసారి కూడా 10.18 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఇలా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగిస్తూనే ఉంది ఈ చిత్రం.

దీంతో సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిన జెమినీ టీవీ వారికి భారీ లాభాలు దక్కినట్టు అయ్యింది. మహేష్ బాబు గత చిత్రం మహర్షి కూడా ఇదే ఛానల్ వారు కొనుగోలు చేశారు. ఆ చిత్రం మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు తక్కువ టి.ఆర్.పి ని నమోదు చేసినప్పటికీ తరువాత మాత్రం దూకుడు చూపించి జెమినీ వారిని లాభాల బాట పట్టేల చేసింది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus