బాలయ్య సెటైర్లు వేసిన ‘సింహం నవ్వింది’ కి 40 ఏళ్ళు… !

నందమూరి బాలకృష్ణకి ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘సింహ’ పేరుతో వచ్చిన బాలయ్య సినిమాలు చాలా వరకు సక్సెస్ సాధించాయి. ‘బొబ్బిలి సింహం’ ‘సమరసింహారెడ్డి’ ‘నరసింహనాయుడు’ ‘లక్ష్మీ నరసింహా’ ‘సింహా’ ‘జై సింహా’ ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. అంతేకాదు చాలా సినిమాల్లో బాలయ్య ఎలివేషన్స్ కోసం సింహం డైలాగులను ఎక్కువగా రాస్తుంటారు. అయితే ‘సింహం’ పేరుతో వచ్చిన బాలయ్య సినిమాల్లో రెండు ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

అందులో ఒకటి ‘సీమ సింహం’ . 2002 లో సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయింది. ఇంకో రెండోది ‘సింహం నవ్వింది’. ‘సింహం నవ్వింది’ గురించి మొన్నామధ్య ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా వెళ్ళినప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు శిరీష్ తో సరదాగా ముచ్చటిస్తున్న టైంలో ‘సింహ నవ్వడం ఏంటి.. అందుకే ప్లాప్ అయ్యింది ఆ సినిమా’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో మెయిన్ హీరో సీనియర్ ఎన్టీఆర్ కాగా, బాలయ్య సెకండ్ హీరో..! అయితే తన తండ్రి నటించిన సినిమాలకు సంబంధించిన టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు.. మరీ ముఖ్యంగా ప్లాప్ సినిమాల టాపిక్ వచ్చినప్పుడు ఆ సినిమా బాగానే ఉంటుంది అంటూ బాలయ్య చెబుతూ ఉంటాడు. కానీ ‘సింహం నవ్వింది’ సినిమా ప్లాప్ అని డైరెక్ట్ గానే చెప్పేశాడు.

ఇంకో విచిత్రం ఏంటి అంటే ‘రామకృష్ణా సినీ స్టూడియోస్’ బ్యానర్ పై నందమూరి హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించడం అలాగే నందమూరి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ అందించడం. ఇక డి. యోగానంద్ దర్శకుడు. 1983 మార్చి 3న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా విడుదలై 40 ఏళ్ళు పూర్తికావస్తోంది. అందుకే ఈ సినిమా గురించి బాలయ్య చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus