ఒకప్పుడు ఇండియన్ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు అంటే ‘వామ్మో.. పెద్ద రిస్క్’ అనేవారు అంతా. అప్పటికి రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలు కూడా అరుదుగా వచ్చేవి. ఒకవేళ అంత మొత్తం కలెక్షన్స్ వచ్చినా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు భయపడేవారు. కానీ ‘బాహుబలి’ ఆ హద్దులు చెరిపేసింది. వందలు కోట్లు బడ్జెట్ పెట్టి.. పాన్ ఇండియా లెవెల్లో ఎలా మార్కెట్ చేసుకోవాలో అందరికీ ఓ లెసన్ నేర్పించింది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి ముందుకు రాలేదు.
కానీ సౌత్ ఫిలిం మేకర్స్ పాన్ ఇండియా కంటెంట్ కోసం పక్క భాషల నటీనటులను ఎంపిక చేసుకుని మార్కెటింగ్ చేస్తున్న విధానం అలాగే సక్సెస్ అవుతున్న విధానం వాళ్లకి అర్థమైంది. అప్పటి నుండి వాళ్ళు కూడా బడ్జెట్ కి పరిమితులు పెట్టుకోకుండా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే ఓ సినిమాని రూ.4 వేల కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు.
అది మరేదో కాదు ‘రామాయణ్’ ప్రాజెక్టు. రణబీర్ కపూర్ రాముడిగా.. యష్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న సినిమా ఇది. సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తుంది. ఇంకా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.4000 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్టు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు.
ఆయన కామెంట్స్ తో ఇండియన్ ఫిలిం మేకర్స్ షాక్ అయ్యారు. అయితే ‘రామాయణ్’ 2 భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా..! అంటే ఒక్కో పార్ట్ కి రూ.2000 కోట్లు అనుకోవాలి. రామాయణాన్ని ఎన్ని సార్లు తీసినా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఏకంగా రూ.4 వేల బడ్జెట్ ను రికవరీ చేయడమంటే.. చిన్న విషయం కాదనే చెప్పాలి.