తేజ సజ్జ రేంజ్ ఇప్పుడు పెరిగింది. ‘హనుమాన్’ ‘మిరాయ్’ సినిమాలతో అతను వంద కోట్ల క్లబ్ లో చేరాడు. మేకర్స్ కి, బయ్యర్స్ కి ఆ సినిమాలు భారీ లాభాలు అందించాయి. దీంతో తేజ సజ్జ నెక్స్ట్ సినిమా అయిన ‘జాంబీ రెడ్డి 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘జాంబీ రెడ్డి’ సినిమా మంచి హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ ఉంటుందని ఆ టైంలోనే ప్రకటించారు. కాకపోతే అది రూ.10 కోట్ల బడ్జెట్ లో తీసిన సినిమా. అందువల్ల దానికి తగ్గ బిజినెస్ జరిగింది.
వీకెండ్ ఓపెనింగ్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేఫ్ అయిపోయారు. తర్వాత ఆ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటూ ఏమీ లేదు. కానీ ‘జాంబీ రెడ్డి 2’ ని నిర్మించేందుకు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ముందుకు వచ్చింది. వాళ్ళు సినిమా క్వాలిటీ విషయంలో తగ్గరు. అందుకే ‘మిరాయ్’ రేంజ్లో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇంకా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళక ముందే ‘జాంబీ రెడ్డి 2’కి రూ.40 కోట్ల ఓటీటీ డీల్ వచ్చేసింది.
సో ఈ సినిమాకి కూడా రూ.100 కోట్ల బిజినెస్ అనేది కేక్ వాక్. కాకపోతే ఇప్పటివరకు చూసుకుంటే ‘హనుమాన్’ ‘మిరాయ్’ సినిమాలకు ఎక్కువ బిజినెస్ జరగలేదు. అవి కమర్షియల్ గా భారీ లాభాలు అందించడానికి కారణం అదే. కానీ ‘జాంబీ రెడ్డి 2’ కి కనుక ఎక్కువ బిజినెస్ జరిగితే.. ప్రాఫిట్స్ కూడా ఆ రేంజ్లో రావాలి. అప్పుడే తేజ సజ్జ స్టార్ హీరో అయినట్టు.
ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ‘జాంబీ రెడ్డి 2’కి ప్రశాంత్ వర్మ దర్శకుడు కాదు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అనౌన్సమెంట్ పోస్టర్ లో కూడా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అని రివీల్ చేసింది లేదు.కానీ అతను కథ, స్క్రీన్ ప్లే అందిస్తాడు అంటున్నారు. సో అలా చూసుకుంటే ‘జాంబీ రెడ్డి 2’ భారాన్ని కంప్లీట్ గా తేజ సజ్జనే మోయాలి.