Vijay Deverakonda: నిజంగానే విజయ్ కి అంతిస్తున్నారా..?

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు అతడి క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. యూత్ లో విజయ్ కి ఫాలోయింగ్ వేరే లెవెల్. రీసెంట్ గా పూరి జగన్నాధ్ తో కలిసి ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేశారు విజయ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు.

ఈ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తో డిస్ట్రిబ్యూటర్లు గొడవ కూడా పెట్టుకున్నారు. ఇంత హంగామా అవ్వడంతో ‘లైగర్’ టీమ్ సైలెంట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ కూడా ఇదివరకు మాదిరి ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు. కొన్నాళ్లుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ‘ఖుషి’ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి సమంత షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ మరో సినిమా చేయబోతున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు ఓకే చెప్పాడు విజయ్ దేవరకొండ. నిజానికి రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కాల్సింది కానీ కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ చేతులు మారింది.

ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండకి రూ.45 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. నిజానికి విజయ్ కి ఇప్పటివరకు పది నుంచి పదిహేను కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ అందించారు. అలాంటిది ఈ సినిమా రూ.45 కోట్లు ఇస్తున్నారంటే షాకింగ్ గా ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. మరి ఈ రెమ్యునరేషన్ వార్తల్లో ఎంతవరకు నిజముందో నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus