సంక్రాంతి వార్‌కి ‘వీర సింహా రెడ్డి’ సిద్ధమయ్యాడు. శుక్రవారం సినిమా ట్రైలర్‌ని, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా నిర్వహించారు. అయితే విడుదలకు సినిమా సిద్ధంగా ఉందా? అంటే పూర్తిస్థాయిలో లేదు అని చెబుతున్నాయి సినిమా వర్గాలు. అదేంటి ఎప్పుడో షూటింగ్ అయిపోయింది కదా అంటారా. అవును మీరు చెప్పింది నిజమే. సినిమా షూటింగ్ అయితే ఎప్పుడో అయిపోయింది.. అయితే ఇంకా సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద ఉంది అనేది తాజా సమాచారం.
సినిమా విడుదలకు పట్టుమని వారం కూడా లేదు. ఈ టైమ్‌లో సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద ఉండటం ఏంటి అనే డౌట్ రాకమానదు. అయితే, సినిమా నిడివి విషయంలో ఇంకా ఫైనల్ టైమ్ లాక్ చేయలేదు అంటున్నారు. అందుకే సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాలేదు అని చెబుతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ సినిమా రన్‌టైమ్ ఏకంగా 197 నిమిషాలు అని తెలుస్తోంది. అంటే మూడు గంటల 17 నిమిషాలు అన్నమాట.
ఇంత పెద్ద సినిమా థియేటర్లలో కష్టమే అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో సినిమాకు మరోసారి కత్తెరేసే పనిలో పడ్డారట టీమ్. సినిమాలో కనీసం 50 నిమిషాలు తీసేయాలని అనుకుంటున్నారట. అంటే రెండున్నర గంటలకు సినిమా తీసుకురావాలనేది ఆలోచనట. ప్రస్తుతం ఎడిట్ టీమ్ ఇదే పనిలో బిజీగా ఉంది అని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ ఎడిట్ అయిపోతుంది అని సమాచారం. ఇటీవల రిలీజైన ‘అవతార్ 2’ సినిమా రన్‌టైమ్ 192 నిమిషాలు అన్న విషయం తెలిసిందే.
దీంతో ఆ సినిమా నిడివి విషయంలో ఇబ్బందులుపడ్డారు ప్రేక్షకులు. ఇప్పుడు బాలయ్య సినిమాకూ అదే పరిస్థితి రావొచ్చు అంటున్నారు. మరీ 50 నిమిషాలు కాకపోయినా కనీసం ఓ అరగంట అయినా కత్తిరించాలి. ఎందుకంటే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నిడివి 160 నిమిషాలే. ఆ లెక్కన బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చాలా పెద్ద సినిమా అనొచ్చు. మరి టీమ్ ఏం చేస్తుంది అనేది చూడాలి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?