Mahesh Babu: సూపర్‌స్టార్‌ లాస్ట్‌ 5 సినిమాలకు.. పేరుకు ఉన్న లింక్‌ చూశారా?

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే పేరు ఎందుకు పెట్టారు? ఏమో టీమ్‌ ఏమనుకున్నారో, ఎవరికి నచ్చిందో పెట్టేశారు అని అంటారా? మీరు చెప్పింది నిజమే కావొచ్చు. అయితే త్రివిక్రమ్‌ తనకు ఎంతో ఇష్టమైన ‘అ’ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మరీ ‘గుంటూరు కారం’ అని పేరు పెట్టారు. సినిమా చూస్తే అలా ఎందుకు పెట్టారో తెలుస్తుంది అని టీమ్‌ చెబుతోంది. అయితే దీని వెనుక మరో వెరైటీ కారణాన్ని వెతికి పట్టుకున్నారు నెటిజన్లు. అదే మహేష్‌ పేరు.

మహేష్‌బాబు తన పేరును షార్ట్‌గా GSSMB అంటుంటారు. ఇప్పుడు ఆ పేరును పూర్తి చేసే క్రమంలోనే త్రివిక్రమ్‌ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే పేరు పెట్టారు అంటున్నారు. ఇదేం లెక్క అనుకుంటున్నారా? మహేష్‌బాబు గత సినిమా ‘సర్కారు వారి పాట’ వచ్చినప్పుడు ఓ చర్చ పెద్ద ఎత్తున జరిగింది. SSMB అని మహేష్‌ను అంటుంటారు కాబట్టి.. అందులో తొలి అక్షరంతో సినిమా పేరు పెట్టారు అని అన్నారు. ఇప్పుడు ‘గుంటూరు కారం’తో ఇంటి పేరును కూడా యాడ్‌ చేశారు అని అంటున్నారు.

మహేష్‌ (Mahesh Babu) రీసెంట్‌ ఐదు సినిమాలు చూస్తే.. G – ‘గుంటూరు కారం’, S – ‘సర్కారు వారి పాట’, S – ‘సరిలేరు నీకెవ్వరు’, M – ‘మహర్షి’, B – ‘భరత్ అనే నేను’. ఇలా మహేష్‌ రీసెంట్‌ 5 సినిమాల మొదటి అక్షరాలు కలిపితే GSSMB వస్తోంది అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరి మహేష్‌ కావాలనే ఇలా చేస్తున్నాడా? లేక అనుకోకుండా జరిగిందా అనేది తెలియాలి.

మామూలుగా అయితే మహేష్‌ ఇలాంటి విషయాలను ఎక్కువగా పట్టించుకుంటాడు అంటారు. మరిప్పుడు GSSMB విషయంలోనూ అదే చేశాడా? అనేది తెలియాలి. త్వరలో సినిమా ప్రెస్‌ మీట్‌ పెట్టినప్పుడు ఈ విషయాన్ని మీడియా అడిగేస్తుంది. లేదంటే మహేషే పెద్ద మనసు చేసుకుని ట్వీట్‌ చేసి క్లారిటీ ఇవ్వాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus