ఈ వారం అంటే ఆగస్టు 2ని టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘శివమ్ భజే’ (Shivam Bhaje) ‘తిరగబడరసామి’ ‘అలనాటి రామచంద్రుడు’ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా అంటే ప్రధానంగా ‘ఉషాపరిణయం’ అనే మూవీ అనే చెప్పాలి. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) : ‘స్వయంవరం’ ‘నువ్వే కావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’’ (Nuvvu Naaku Nachav) ‘మన్మథుడు’ ‘మల్లీశ్వరి’ (Malliswari) వంటి ఆల్ టైం సూపర్ హిట్ సినిమాలని మనకు అందించారు విజయ్ భాస్కర్ గారు. ఆయన సినిమాల్లో హెల్దీ కామెడీ ఉంటుంది. ఎమోషనల్ గా కూడా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఓ మంచి క్లైమాక్స్ ఉంటుంది.
2) విజయ్ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ : విజయ్ భాస్కర్ గారు తన కొడుకు శ్రీ కమల్ ను హీరోగా పెట్టి చేసిన మూవీ ఇది. కాబట్టి.. ఇంకా స్పెషల్ గా ఉంటుంది అని స్పష్టమవుతుంది.
3) టీజర్, ట్రైలర్స్ యూత్ ని మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.విజువల్స్ కూడా చాలా క్వాలిటీగా అనిపించాయి. మొత్తంగా అవి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి.
4) హీరోయిన్ తాన్వి లుక్స్ కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. ‘నువ్వులే నువ్వులే’ అనే పాటలో ఆమె హావభావాలు కూడా అందరినీ కట్టిపడేసే విధంగా ఉన్నాయనిపిస్తోంది.
5) ఆర్.ఆర్.ధృవన్ సంగీతంలో రూపొందిన లిరికల్ సాంగ్స్ అన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. సినిమాలో, విజువల్ గా అవి మరింతగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
6) మొత్తంగా.. ఈ మధ్య కాలంలో ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ రాలేదు. కాబట్టి.. ‘ఉషాపరిణయం’ ఆ లోటు తీర్చే అవకాశం ఉంది.