రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే డబుల్ ఇస్మార్ట్ రిలీజవుతుందని రామ్ (Ram) అభిమానులు భావించారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి క్లీన్ చిట్ వచ్చినా ఎగ్జిబిటర్లు మాత్రం ఈ సినిమాకు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. నైజాం థియేటర్ల యజమానులలో కొంతమంది తమ థియేటర్లను డబుల్ ఇస్మార్ట్ కు ఇవ్వడానికి ఆసక్తి చూపట్లేదని భోగట్టా.
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తికి సైతం మూడు కోట్ల వరకు లైగర్ (Liger) బకాయిలు అందాల్సి ఉంది. డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి పోటీ లేకుండా విడుదలై ఉంటే ఈ సినిమాకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు కొంతమేర తప్పేవి. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు కలెక్షన్ల పరంగా నైజాం ఎంతో కీలకం కాగా ఈ సమస్యలు రిలీజ్ సమయానికి పరిష్కారమవుతాయేమో చూడాలి.
మరోవైపు డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. హీరో రామ్ మాత్రం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని భోగట్టా. ఈ సినిమా నైజాం హక్కులకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి.
పూరీ జగన్నాథ్ కు (Puri Jagannadh) కెరీర్ బెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ సైతం ఆకాంక్షిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ ఇబ్బందులను అధిగమించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ ఒక విధంగా పూరీ కెరీర్ ను డిసైడ్ చేసే సినిమా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.