కబాలిలో ఆకర్షించే అంశాలు ఇవే

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ తర్వాత నటించిన చిత్రం కబాలి. ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. యువ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే 220 కోట్ల బిజినెస్ చేసి రికార్డ్ నెలకొల్పింది. సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న కబాలిలోని ప్రధాన అంశాలు ఇవే.

1. కబాలి అంటే ముందు అందరికీ గుర్తుకు వస్తున్నది రజనీ లుక్. సూట్ లో నెరిసిన గెడ్డంతో ఉన్న సూపర్ స్టార్ స్టైల్ గా నడిచి వస్తుంటే … ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా .. అనిపిస్తోంది.

2. యువ దర్శకుడు పా. రంజిత్ కామన్ పాయింట్ తో “మద్రాస్” అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ గా రజనీని కబాలిలో కొత్త యాంగిల్లో చూపిస్తున్నారు.

3 . ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కబాలి కోసం అద్భుతమైన స్వరాలను ఇచ్చారు. గిటార్ మ్యాజిక్ తో నిప్పులాంటి పాటలు ఇచ్చారు. మలేషియా సంప్రదాయ సంగీతాన్ని, ర్యాప్ ని మేళవించి కంపోజ్ చేసిన పాటలు కొత్త ఫ్లేవర్ తో ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన నాటి నుంచి కబాలి పాటలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి.

4. బాలీవుడ్ హాట్ లేడీ రాధికా ఆప్టే, రజనీ కాంత్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందని చిత్ర బృందం తెలిపింది. రజనీ సినిమాల్లో యాక్షన్, లవ్ అరుదుగా మిక్స్ అవుతుంటాయి. కబాలి విషయంలోనూ అదే జరిగింది.

5. కబాలి ని ఎక్కువగా మలేషియా, బ్యాంకాక్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆ ప్లేస్ లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus