షానీ – అభినయశ్రీ ఇద్దరూ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నుంచీ మొదటిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్. ఇద్దరూ కూడా ఈ సీజన్ లో బిగ్ బాస్ నుంచీ బయటకి వచ్చిన మొదటి కంటెస్టెంట్స్ గా చెప్పొచ్చు. అయితే, షానీ ఎలిమినేషన్ ని అన్యాయమని చెప్పి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కావాలనే అభితో పాటుగా షానిని కూడా ఎలిమినేట్ చేశారని బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వీళ్లు అసలు గేమ్ ఏం ఆడారు ? ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనేది ముఖ్యంగా ఐదు రీజన్స్ చూసినట్లయితే,
నెంబర్ 1
గేమ్ లో దూసుకెళ్లే మనస్తత్వం ఇద్దరికీ లేదు. అనవసరంగా ఎవరినీ కెలక్కుండా తమ గేమ్ ని ఆడుకోవడం, మన ఛాన్స్ వచ్చేవరకూ వెయిట్ చేయడం , ఇద్దరూ చేసిన మిస్టేక్స్. స్టేజ్ పైన నాగార్జున కూడా ఇదే చెప్పాడు. దూసుకుని వెళ్లిపోవాలి. ఫస్ట్ డే నుంచే గేమ్ ఆడటం మొదలుపెట్టాలి అని. నిజానికి ఈ విషయం షానికి శనివారం ఎపిసోడ్ లో చెప్పే ప్రయత్నం చేశాడు కింగ్ నాగార్జున. కానీ, షానీ వాగ్వివాదం చేస్తుంటే బ్రేక్ వేయాల్సి వచ్చింది. నిజానికి షానీ అసలు గేమ్ లో , హౌస్ లో ఎక్కడున్నాడు అనేది అస్సలు కనిపించలేదు. ఫస్ట్ వీక్ లో మాస్ నుంచీ అభినయశ్రీ పోటికి వచ్చి ట్రాష్ లోకి వచ్చేసింది. దీంతో నామినేట్ అవ్వాల్సి వచ్చింది. అసలు షానీకి అవకాశం దొరకలేదు. అందుకే, షానీ మాత్రం మొదటి వారం అస్సలు గేమ్ లో లేకుండా పోయాడు.
నెంబర్ 2
వీరిద్దరూ కూడా కంటెంట్ క్రియేట్ చేయలేకపోవడం అనేది మైనస్. ఇంట్లో ఉన్నారా.. ముచ్చట్లు చెప్పుకున్నారా అన్నట్లుగానే వీరి గేమ్ సాగింది. ఏవిషయంలోనూ పెద్దగా ఇన్వాల్ అవ్వలేదు. కెమెరా స్పేస్ ఎలా దొరుకుతుంది అనేది అవగాహనే లేకుండా పోయింది. కనీసం ఇద్దరు పోట్లాడుకుంటున్నా మద్యలో వెళ్లినా కనిపించేవారు. అది కూడా లేదు.
నెంబర్ 3
నామినేషన్స్ లోకి రావడం అనేది ఇద్దరి బ్యాడ్ లక్. ఇది వాళ్ల చేతిలో లేకపోయినా కూడా కనీసం హౌస్ మేట్స్ అందరితో మింగిల్ అయి ఉంటే సుదీప లాగా సేఫ్ గా ఉండేవాళ్లు. అలాగే నేహా కూడా అందరితో కలుపుకుంటూ వెళ్లింది. నేహా కూడా రెండువారాలు సేఫ్ జోన్ లో ఉంది. శ్రీసత్య, వాసంతీ లాగా అయినా సేఫ్ గేమ్ ఆడుంటే ఖచ్చితంగా సేఫ్ లో ఉండేవారు. ఇద్దరూ ఒకరికొకరు నామినేట్ చేస్కున్నారు. షానీని అభి నామినేట్ చేస్తే, షానీ తిరిగి అభిని నామినేట్ చేశాడు. దీనివల్ల ఇద్దరూ డేంజర్ జోన్ లోకి వచ్చారు.
నెంబర్ 4
సోషల్ మీడియాలో ఇధ్దరూ కూడా పాపులర్ కాదు. పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. అస్సలు షానీ ని ఆర్టిస్ట్ గా చాలామంది మర్చిపోయారు. బిగ్ బాస్ కి రావడం వల్లే మరోసారి షానీ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అలాగే అభి కూడా అంతే, ఎప్పుడో తెలుగు సినిమాల్లో బిజీ బిజీగా నటించేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ లోనే తెలుగు ప్రేక్షకులు చూశారు. కాబట్టి ఓటు వేసి గెలిపించేంత ఓట్ బ్యాంక్ అభికి లేకుండా పోయింది. ఇది కూడా మైనస్.
నెంబర్ 5
షానికి, అభికి బిగ్ బాస్ షో గురించి పెద్దగా అవగాహన లేకపోవడం కూడా ఎలిమినేషన్ కి దారితీసింది. ఈ షో గురించి సోసోగా తెలుసుకుని రావడం అనేది కూడా దెబ్బకొట్టింది. అన్ని సీజన్స్ ఒకవేళ చూసి ఫాలో అయి ఉంటే ఖచ్చితంగా ఇద్దరూ స్మార్ట్ గేమ్ ఆడి ఉండేవాళ్లే. అందుకే, షానీ ఇంకా అభి ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయి ఉండచ్చు. మొత్తానికి బిగ్ బాస్ ఫస్ట్ వీక్ వదిలేసినా కూడా సెకండ్ వీక్ ఇద్దరిని ఎలిమినేట్ చేయడం అనేది బిగ్ బాస్ లవర్స్ కి మంచి కిక్ ఇచ్చింది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!