సినిమా పరిశ్రమ అనే కాదు.. నిజజీవితంలో కూడా ఇప్పుడు ప్రేమ, బ్రేకప్, డేటింగ్, పెళ్లి, విడాకులు వంటి వ్యవహారాలు కామన్ అయిపోయాయి. లైఫ్ టైం అనేది తక్కువైపోయింది అని భావించో ఏమో కానీ.. తమ కంపానియన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. కలిసుండేది ఎంతకాలమైనా సంతోషంగా గడపాలని అనుకుంటున్నారు. అది వర్కౌట్ కాకపోతే ఏ ఏజ్లో అయినా సెపరేట్ అయిపోవడానికి రెడీ అయిపోతున్నారు.న్యాయస్థానాలు కూడా వారికి అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చేశాయి.
ఇక అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ నటి మలైకా అరోరా అందరికీ సుపరిచితమే. మొదట ఈమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థలు రావడంతో మలైకా.. అర్బాజ్ విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆమె అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.

కొన్నేళ్ల పాటు వీళ్ళు సహజీవనం చేశారు. అర్హాన్ ను కూడా సొంత కొడుకులా చూసుకుంటున్నాడు అర్జున్ అంటూ మలైకా సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అని అంతా భావించారు. కానీ వీళ్ళు విడిపోయారు. వీరి మధ్య ఏం జరిగిందో వీళ్ళకే తెలియాలి.

అయితే ఇప్పుడు మలైకా మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. హర్ష్ మెహతా అనే ఓ బిజినెస్ మెన్ తో మలైకా డేటింగ్ మొదలు పెట్టింది. అతని వయసు 33 ఏళ్ళు మాత్రమే. ఇటీవల ఓ ఈవెంట్లో ఈ జంట వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. కాగా మలైకా కొడుకు వయసు 21 ఏళ్ళు కావడం గమనార్హం.
