అడివి శేష్.. కెరీర్ ప్రారంభంలో ‘సొంతం’ ‘కర్మ’ ‘పంజా’ ‘బలుపు’ ‘రన్ రాజా రన్’ ‘బాహుబలి ది బిగినింగ్’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అటు తర్వాత ‘కిస్’ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దీంతో మళ్ళీ అతను డైరెక్షన్ వైపు చూడలేదు. తర్వాత ‘దొంగాట’ చిత్రంలో కూడా నటించి మెప్పించాడు. ఆ సినిమాలో హీరోగా కనిపించి చివరిలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడు.
అయితే శేష్ కు ఆ సినిమాల పరంగా కలిసొచ్చింది ఏమీ లేదు. హీరోగా మారి చేసిన ‘క్షణం’ మూవీకి రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అతి కష్టం మీద జరిగింది. అది పీవీపీ బ్యానర్లో రూపొందిన సినిమా కాబట్టి.. అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత శేష్ చేసిన ‘అమీ తుమీ’ ‘గూఢచారి’ ‘ఎవరు’ ‘మేజర్’ ఇప్పుడు ‘హిట్ 2’ .. ఇలా వరుసగా 6 హిట్లు సొంతం చేసుకున్నాడు అడివి శేష్.
దీంతో శేష్ స్టార్ హీరో అయిపోయినట్టేనా? అనే విషయం పై డిస్కషన్లు మొదలయ్యాయి. అయితే అడివి శేష్ వరుసగా హిట్లు కొట్టినా.. స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అడివి శేష్ ఎన్ని హిట్లు కొట్టినా.. అతని మార్కెట్ రూ.30 కోట్లకు(నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలుపుకొని) మించలేదు. పైగా స్టార్ హీరో అంటే మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా రకాల పాత్రలు చేయాలి.
కానీ శేష్ మాత్రం క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అతని బలం అదే కావచ్చు కానీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరిస్తేనే స్టార్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ‘హిట్2’ రిజల్ట్ ను బట్టి.. టైర్ 2 హీరోల లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!