Thandra Paparayudu: తాండ్రపాపారాయుడు సినిమాలో నటించిన 6 ఎంపీలు ఎవరో తెలుసా?

  • May 23, 2023 / 07:11 PM IST

తెలుగు సినిమాల ఖ్యాతిని రెట్టింపు చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు, మెగాఫోన్‌ను ఎలా పట్టుకోవాలో, నేటి దర్శకులు ఆయనను చూసే నేర్చుకోవాలి. దర్శకత్వం అనే కళలో రాణించాలంటే, ఏ డైరెక్టర్ అయినా ఆయన తీసిన చిత్రాలే చూడాలి. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఓ విశ్వవిద్యాలయం. ఆయన తీసిన ప్రతీ చిత్రమూ, ఓ పరిశోధక గ్రంథం అని చెప్పాలి. దాసరి నారాయణ రావు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే.. అది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

తాండ్ర పాపారాయుడు (Thandra Paparayudu) 1986లో వచ్చిన తెలుగువాడి జీవిత చరిత్ర చిత్రం. ఈ మూవీని దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. 18వ దశాబ్దపు యోధుడు తాండ్రపాపారాయుడు జీవితం ఆధారంగా గోపికృష్ణా మూవీస్ పతాకంపై యు.సత్యనారాయణ రాజు నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, సుమలత, ప్రాన్, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని 11వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. రెండు ప్రధాన రాజవంశాలు, బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు.

విజయనగర ప్రభువు విజయరామరాజు భార్య చంద్రాయమ్మ కుమారునితో కలిసి బొబ్బిలి రాజు రంగారావు నాయుడు రాణి మల్లమాంబల కుమారుడు వెంకటరాయల పుట్టినరోజు వేడుకలకు బొబ్బిలి వస్తాడు. ఆనాడు జరిగిన కుస్తీ పోటీల్లో, కోడిపందేల్లో, బలప్రదర్శనలో విజయనగరం వారిపై, బొబ్బిలివారు సాధించిన విజయాలకు, అసూయపడతాడు. రామరాజు వారిని ఏ విధంగానైనా అనగద్రొక్కాలని సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. రాజాం ప్రభువు తాండ్రపాపారాయుడు బొబ్బిలికి అండ. అతని చెల్లెలు సుభద్రకు, రంగారావు నాయుడు, తమ్ముడు వెంగళరాయుడుకు వివాహం నిశ్చయిస్తారు.

ఈలోపు ఫ్రెంచి గవర్నరు తరపున బుస్సీ కప్పాలు కట్టవలసినదిగా తాఖీదులు పంపుతాడు. తామెవరికి సామంతులు కామని, కప్పాలు కట్టమని బొబ్బిలిరాజులు తిరస్కరిస్తారు. ఆ తర్వాత కొన్ని మలుపులతో సినిమా ముగుస్తుంది. అలా ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే.. వివిధ కాలాల్లో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఆరుగురు కృష్ణంరాజు, జయప్రద, దాసరి నారాయణరావు, సి.నారాయణరెడ్డి, మోహన్ బాబు, సుమలతలు ఈ సినిమాలో పనిచేశారు. వీరు వేరు పార్టీల నుంచి ఎంపీలుగా నియమించబడ్డారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus