Pushpa Movie: విక్రమ్ టు విజయ్ సేతుపతి.. ‘పుష్ప’ లో విలన్ రోల్ మిస్ చేసుకున్న 6 మంది స్టార్లు..!

‘అల వైకుంఠపురములో’ తర్వాత ‘పుష్ప'(పుష్ప ది రైజ్) రూపంలో అల్లు అర్జున్ కు మరో హిట్ సినిమా దొరికింది. మొదట నెగిటివ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడ రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ మూవీ.. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ పై కూడా అంచనాలు ఏర్పడేలా చేసింది.

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ కలెక్షన్లను ‘పుష్ప’ అధిగమించడంతో ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ పార్ట్ 1 లో విలన్ గా ఫహాద్ ఫాజిల్ నటించాడు. బెన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు ఫహాద్. ఈ చిత్రం విజయంలో అతని పాత్ర కూడా చాలా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రకు మొదటి ఛాయిస్ ఫహాద్ ఫాజిల్ కాదు. చాలా మంది రిజెక్ట్ చేస్తే అది ఇతని వద్దకు వెళ్ళింది. ముందుగా ‘పుష్ప’ లో విలన్ గా విక్రమ్ ను అనుకున్నారట. కానీ విక్రమ్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడు. అటు తర్వాత విజయ్ సేతుపతి ని అడిగారు. ఇది అందరికీ తెలిసిన సంగతే..! కాల్ షీట్లు ఖాళీ లేక అతనే తప్పుకున్నట్టు తెలిపాడు.

వీళ్ళిద్దరూ కాకుండా ‘భీష్మ’ విలన్ జిష్షు సేన్‌గుప్తా ని కూడా అడిగారట. అతను కూడా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడు. అలాగే మాధవన్ ను, ఆర్య ని కూడా అడిగారు. వీళ్ళు కూడా వేరే ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో.. చేయలేకపోయారు అని తెలుస్తుంది. వీళ్ళు చేస్తే ఆ పాత్ర స్థాయి వేరే రేంజ్ లో ఉండేదేమో కానీ… ఫహాద్ ఫాజిల్ కూడా ఏమాత్రం తక్కువ చేయలేదు అనే చెప్పాలి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus