Tripti Dimri: ఆ విషయం తెలుసుకోండంటూ త్రిప్తి ఫైర్.. ఏం జరిగిందంటే?

యానిమల్  (Animal) సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో త్రిప్తి డిమ్రికి (Tripti Dimri) క్రేజ్ పెరిగిపోయింది. యానిమల్ లో బోల్డ్ రోల్ లో నటించినా త్రిప్తికి ఊహించని స్థాయిలో ఆఫర్లు అయితే వస్తున్నాయి. అయితే కొంతమంది సోషల్ మీడియాలో త్రిప్తి గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సెమీ న్యూ*డ్ సన్నివేశాల్లో నటించిన మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న నెటిజన్ నుంచి ఎదురైంది.

Tripti Dimri

ఆ ప్రశ్నకు త్రిప్తి స్పందిస్తూ మరి నాతో అర్ధ నగ్నంగా నటించి, ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయిన రణబీర్ (Ranbir Kapoor) పాత్రను ఎందుకు దూషించరని ఆమె ప్రశ్నించారు. తను మగాడనా అంటూ ఆమె కామెంట్లు చేశారు. రోల్ కోసం ఆడవాళ్లు బోల్డ్ గా నటిస్తే పాపమా అని త్రిప్తి పేర్కొన్నారు. బోల్డ్ సీన్స్ లో నటించినంత మాత్రాన రియల్ లైఫ్ లో అలాగే ఉంటామని ఎలా జడ్జ్ చేస్తారని ఆమె తెలిపారు.

ప్రేక్షకులకు ఏది చూడాలో ఏది చూడకూడదో ఎంచుకునే హక్కు ఉందని త్రిప్తి పేర్కొన్నారు. ఒకరిని దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదని ఆమె తెలిపారు. మగాళ్లను ఒక విధంగా ఆడవాళ్లను మరో విధంగా చూడటం మానుకోవాలని త్రిప్తి పేర్కొన్నారు. సినిమాల్లో రొమాన్స్ చేయడంలొ ఆడ, మగ ఇద్దరిదీ సమాన పాత్ర అని త్రిప్తి డిమ్రీ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

 

త్రిప్తి డిమ్రీ ఏ విషయం గురించి స్పందించినా ఆ విషయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. త్రిప్తీ డిమ్రి తన మనస్సులోని అభిప్రాయాలను ఒకింత ఘాటుగా వెల్లడిస్తున్నారు. యానిమల్ సక్సెస్ తర్వాత త్రిప్తి డిమ్రీ రెమ్యునరేషన్ సైతం భారీస్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

దేవర క్లైమాక్స్ ను అలా ముగిస్తే ఫ్యాన్స్ కు నచ్చుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus